ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కావొస్తున్న విషయం తెలిసిందే. ఈ 9 నెలల కాలంలో జగన్ చాలావరకు సీఎంగా సక్సెస్ అయిపోయారు. అటు మంత్రుల్లో కూడా చాలామంది తమ తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, మంచి పనితీరు కబరుస్తున్నారు. అయితే 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందంటే? చెప్పలేం కూడా. ఎమ్మెల్యేల్లో కొందరు పనితీరు బాగుంటే, మరికొందరు వెనుకపడే ఉన్నారని తెలుస్తోంది.

 

కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో వారు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. జగన్ గాలి బాగానే ఉన్న, గెలుపుకి ఎమ్మెల్యేల కష్టం కూడా తొడవాల్సి ఉంటుంది. అలా కాస్త కష్టపడాల్సిన ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లాకు చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈయన నియోజకవర్గానికి అటు ఇటు ఉన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు దూసుకెళుతుంటే జోగి రమేశ్ మాత్రం కాస్త వెనుకపడి ఉన్నారని తెలుస్తోంది.

 

పేర్ని నాని మంత్రిగా ఉంటూనే తన నియోజకవర్గం మచిలీపట్నంలో, కొడాలి నాని గుడివాడలో పని చేసుకుంటున్నారు. కానీ మచిలీపట్నం, గుడివాడ మధ్యలో ఉన్న పెడన నియోజకవర్గంలో రమేశ్ పనితీరు ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఈయన ఎక్కువ విజయవాడకే పరిమితం అవ్వడం వల్ల నియోజకవర్గ ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది. పైగా ఈయన వర్గానికి, మరో వైసీపీ నేత ఉప్పాల రామ్ ప్రసాద్ వర్గానికి అసలు పడటం లేదు.

 

దీనికి తోడు ఇటీవల పెన్షన్, రేషన్ కార్డుల సమస్యలు వస్తే జోగి పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఈయన అనుచరులు కావల్సిన వారికే రేషన్, పెన్షన్ కార్డులు ఇప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇటీవల పెడన మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో పెన్షన్, రేషన్ కార్డులు పోయాయని జోగి దగ్గరకు వెళ్ళితే, ‘మీరు మాకు ఓటు వేశారా? పోతే నాకేం సంబంధం లేదని’ మాట్లాడారని పెడన టౌన్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

 

ఈ పరిస్థితులన్నీ కలిసి స్థానిక ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది. పెడన మున్సిపాలిటీతో సహ పలు జెడ్‌పి‌టి‌సి, ఎం‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు రావని ప్రచారం జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: