అమెరికాలో ఇప్పుడు మేజర్లు, మైనర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గన్ లైసెన్స్ ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్స్ జరుగుతున్నాయి.  ఓ వైపు ఉగ్రదాడులతో సతమతమవుతుంటే.. మరోవైపు ఉన్మాధులు ఎక్కడు పడితే అక్కడ రెచ్చిపోతున్నారు.  చిన్న చిన్న విషయాలకు టెన్షన్ కి గురి అయిన వారు డిప్రేషన్ లోకి వెళ్లి ఉన్మాధులుగా మారిపోయి అమాయకులపై గన్ ఫైర్ చేస్తున్నారు.  భారతీయులపై ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడంపై అక్కడి ప్రజలే కాదు.. ఇతర దేశాల నుంచి వెళ్లుతున్నవారు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

 

ఈ కల్చర్ కారణంగా ఎక్కడో ఒకచోట కాల్పుల కలకలం రేగుతూనే ఉన్నది.  తాజాగా అమెరికాలోని మిల్ వాకీ నగరంలో కాల్పుల కలకలం రేగింది. ఓ బీర్ల కంపెనీ ఉద్యోగి తోటి ఉద్యోగులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. అనంతరం తనను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కంపెనీలో పనిచేసే 51ఏళ్ల ఉద్యోగి మిల్‌వాకీలోని మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాడు. తన వద్ద ఉన్న గన్ తో ఉన్మాధిగా మారిన మెల్సన్ కూర్స్ తనకు ఎదురు వచ్చిన వారిపై కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. 

 

ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు.  మెల్సన్ కూర్స్ చేసిన ఫైర్ లో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ఆ తర్వాత మెల్సన్ కూర్స్  సైతం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటనను ఎంతో క్రూరమైనదిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: