ఈ హెడ్డింగ్ కాస్త ట్విస్టింగ్‌గానే ఉంటుంది.. అయితే ఇది నిజ‌మే.. మార్చి నెలంతా ఏపీలో వ‌రుస ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు అన్నీ అగ్నిప‌రీక్ష‌లే ఎదురు కానున్నాయి. ముందుగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కూడా త్వ‌ర‌గా ఫినిష్ చేయాల‌ని కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో జ‌గ‌న్ వీటిని కూడా త్వ‌ర‌గా ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఎన్నికలు జర‌గ‌నున్నాయి. నాలుగు స్థానాల్లో అధికార వైసిపి ఖాతాలోనే పడనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు కూడా దిక్కు లేదు. దీంతో అసలు రాజ్యసభ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే చంద్రబాబుకు లేదు. దీంతో ఆయన హ్యాపీగా ఉండొచ్చు.



అయితే ఈ నాలుగు స్తానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నా అవి ఎవ‌రికి ఇవ్వాల‌న్న‌దే జ‌గ‌న్ ముందు ఉన్న అగ్నిప‌రీక్ష‌. మ‌రోవైపు శాస‌న మండ‌లి కూడా ర‌ద్దు చేయ‌డంతో జ‌గ‌న్ ఈ నాలుగు స్థానాలు ఎవ‌రికి ఇస్తారో కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఇక మ‌రో వైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ వీటి బాధ్య‌త‌ల‌ను ఆయా జిల్లాల మంత్రుల‌కు అప్ప‌గించేశారు. ఈ ఎన్నిక‌లు తప్పనిసరిగా మార్చినెలలో పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.



మార్చిలోగా స్థానిక ఎన్నికలు పూర్తికాకపోతే గనుక.. కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన 3214 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయి. ఇది కూడా జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీలు కూడా పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నాయి. మ‌రో వైపు చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌జాచైత‌న్య యాత్ర‌లు అంటూ ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఆయ‌న త‌న పార్టీ నేత‌ల‌ను కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని సూచిస్తున్నారు.



ఇక టీడీపీ ఈ ఎన్నిక‌లు ఎలాగూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో పాటు ఎన్నిక‌ల‌కు రెడీ అయ్యింది. ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం సంచ‌ల‌న ఫ‌లితాలు న‌మోదు చేస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై 9 నెల‌ల‌కే వ్య‌తిరేక‌త అని ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు జ‌న‌సేన - బీజేపీ క‌లిసి కూడా ఈ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాయి. మ‌రి ఈ రెండు పార్టీల కూట‌మి ఏం చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: