ఈరోజు అనగా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే కావున మన భారత శాస్త్రవేత్తలలో మహా ఉత్తముడైన చంద్రశేఖర్ వెంకటరామన్ గురించి తెలుసుకుందాం. సర్ సీ.వీ.రామన్ గా పిలవబడే చంద్రశేఖర్ వెంకటరామన్ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా పేరు సంపాదించారు. ఇండియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతిని అందుకున్న సీవీ రామన్ 1888లో నవంబరు 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు.




ఆకాశం, సముద్రం రెండూ నీలి రంగులో ఎందుకు ఉంటాయని ఓ ఆసక్తికరమైన పరిశోధన చేసి అప్పటిలో ఒక పెద్ద సంచలనం రేపారు. ఆకాశంలోని కిరణాలు సముద్రం పై పడినప్పుడు కేవలం నీలిరంగు క్షణాలు మాత్రమే సముద్రంలోపలికి చొచ్చుకుపోయి నీలిరంగు ని ప్రతి ఫలిస్తాయని 'రామన్ ఎఫెక్ట్' అనే పరిశోధన ద్వారా ప్రపంచానికి సర్ సీవీ రామన్ తెలియజెప్పారు. ఐతే 1930వ సంవత్సరంలో 'రామన్ ఎఫెక్ట్' సిద్ధాంతం వలన అతనికి నోబెల్ ప్రైస్ లభించింది. ఒక వస్తువు మీద కాంతి కిరణం పడితే అది ఎలా పరావర్తనం చెందుతుందో అని ఎన్నో పరిశోధనలు చేసి రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని సీవీ రామన్ కనిపెట్టారు. 1929వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రామన్ ఎఫెక్టు ను అభినందిస్తూ నైట్ బాచిలర్ అనే అవార్డుని అందజేసింది.



1932లో క్వాంటం ఫోటాన్ స్పిన్ కనిపెట్టి ఆ తర్వాత క్వాంటం నేచర్ అఫ్ లైట్ ని సివి రామన్, సూరి బాగావతం కలిసి కనిపెట్టారుు. 1933 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ISS) కి డైరెక్టర్ గా సీవీ రామన్ నియమితులయ్యారు. అయితే, ఆ బ్రిటిష్ వారి కాలంలో ISS మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ గా సీవీ రామన్ ఎంపిక కావడం అనేది గొప్ప విషయం. 1947 లో భారతదేశం నేషనల్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా గా అప్పాయింట్ చేసింది. 1954 లో సీవీ రామన్ భారతరత్న అవార్డు కూడా గెలుచుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: