కరోనా 50 దేశాలను భయపెడుతున్నది.  గతంలో ఎన్నో వైరస్ లు ప్రపంచాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.  కానీ, ఏ వైరస్ కూడా ఈ స్థాయిలో భయపెట్టిన రోజులు లేవు.  కానీ, ఈ కరోనా వైరస్ మాత్రం ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తోంది.  వైరస్ పేరు వింటేనే భయపడిపోతున్నారు.  అసలు ఏమి తెలియని వ్యక్తులు కూడా ఈ వైరస్ పేరు చెప్తే షాక్ అవుతున్నారు.  బాబోయ్ ఈ వైరస్ గురించి మాదగ్గర చెప్పకండి ప్లీజ్ అంటున్నారు.

  
ఇప్పుడు మరో సమస్య ప్రపంచాన్ని భయపెడుతున్నది. అది కూడా కరోనా ప్రభావం వలన వచ్చిన సమస్యనే.  అదేమంటే,కరోనా కారణంగా ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి.  ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తోంది.  నిమిష నిమిషానికి కోట్లాది రూపాయలు స్వాహా అవుతున్నది.  నిన్నటి వరకు బూమ్ లో ఉన్న మార్కెట్లు, ఈరోజు సడెన్ గా డౌన్ ఫాల్ కావడంతో షాక్ అవుతున్నారు.  ఏం జరుగుతుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

 
ప్రపంచంలో ప్రతి స్టాక్  ఎక్స్చేంజి కూడా ఇదే విధంగా డౌన్ అవుతూ వస్తోంది.  ఐదు నిమిషాల వ్యవధిలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉన్నదో.  మొన్నటి వరకు కరోనా కేవలం చైనా వంటి దేశాల్లో మాత్రమే ఉన్నది.  కానీ, ఇప్పుడు ఈ వైరస్ చైనా నుంచి బయతదేశాల్లో కూడా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.  


యూరప్ లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.  యూరప్ ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడుతుంది.  ఇప్పుడు ఆ రంగంపై ప్రభావం చూపిస్తోంది.  ఇటు ఇరాన్ కూడా ఈ వైరస్ దెబ్బకు తలక్రిందులైంది.  ఇరాన్ లో వైరస్ వ్యాపించడంతో దాని పక్కనే ఉన్న సౌదీ అరేబియా మక్కా యాత్రను నిలిపివేసింది.  అంతేకాదు, ఇటలీ, సౌత్ కొరియా దేశాలు కూడా ఈ వైరస్ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఈ కరోనా వలన ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: