ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపస్ కు ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పిరమల్ నత్వానీ తో కలిసి వచ్చారు. ఐతే వీరికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, పిరమల్ ఒక గంటన్నర పాటు భేటీ లో పాల్గొన్నారు. ఈ భేటీలో అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంపై కీలక చర్చ కొనసాగిందని తెలుస్తోంది. ముఖేష్ అంబానీ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరి భేటీ ముగిసిన తర్వాత ముఖేష్ అంబానీని క్యాంపస్ మెట్ల వరకు వచ్చి వీడ్కోలు పలికారు జగన్మోహన్ రెడ్డి.

 

 

గత కొన్ని నెలలుగా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి అని టీడీపీ నేతలు ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కియా మోటార్స్ పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి పొరుగు రాష్ట్రానికి వెళ్ళి పోతున్నాయని, కొత్త పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని, రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగడం లేదని టిడిపి పార్టీ ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేసింది. కానీ సాక్షాత్తు కియా మోటార్స్ నిర్వాహకులు పెదవి విప్పి వివరణ ఇచ్చేసరికి ఆ వివాదం సద్దుమణిగింది.

 

 

అయితే ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టేందుకు, సరికొత్త భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంతటి గొప్ప వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ జగన్ మోహన్ రెడ్డి ని కలిసే సరికి ఈ అంశం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అలాగే 13 జిల్లాల అభివృద్ధి గురించి ఈ భేటీలో చర్చ జరిగిందని తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ముకేశ్ అంబానీ జగన్ భేటీ ఆసక్తికర అంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: