అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక సందర్భంగా భారత్- అమెరికా మధ్య రక్షణ ఒప్పందం కుదరింది. ఇందులో బాగంగా 30 అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 30 హెలికాప్టర్ల ధర ఎంతో తెలుసా.. అక్షరాలా 21 వేల కోట్ల రూపాయలు.. ఇప్పుడు ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.

 

 

ట్రంప్ రాక సందర్భంగా అమెరికాకే మేలు జరిగిందని.. మోడీ సర్కారు అప్పనంగా అమెరికాకు లబ్ది చేకూరుస్తుందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు గానే చూడాలి. ఎందుకంటే.. వాటి ధర ఎక్కువగా కనిపిస్తున్నా..వి యుద్ధ విమానాలన్న విషయం మరిచిపోకూడదు. అపాచీ హెలీకాప్టర్లను ప్రపంచంలోనే మంచి పేరు ఉంది. దీనికి సాటి వచ్చే సంస్థలు కూుడా లేవు.

 

 

మన సైన్యాన్ని బలోపేతం చేసే విషయంలో ఇలాంటి ఖర్చులను రాజకీయం చేయకూడదు. హెలికాప్టర్ల కొనుగోలుకి సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత.. మొదటి దశలో ఆరు రోమియో హెలికాప్టర్లు ఏడాదిలోగా భారత్ రానున్నాయి. మిగిలిన 18 హెలికాప్టర్లు నాలుగేళ్లలో అందిస్తారు. వీటిని లాక్‌హీడ్ మార్టిన గ్రూప్ తయారు చేస్తోంది. అమెరికన్ నేవీలో రోమియో హెలికాప్టర్లది కీలక పాత్ర. ఉన్న చోట నుంచే పైకి ఎగరడంతో పాటు వేగంగా ప్రయాణించడం, శత్రు భీకరమైన దాడులు చేయడంలో ఈ హెలికాప్టర్లు ఎక్స్‌పర్ట్స్‌.

 

 

అంతే కాదు ఈ యుద్ధ హెలికాప్టర్లు రాత్రి పూట కూడా గురి తప్పకుండా దాడి చేస్తాయి. రాడార్ వ్యవస్థతో పాటు నైట్ విజన్.. మిస్సైల్స్‌ను ప్రయోగించే ప్రత్యేకత వీటి సొంతం. టొర్పెడోలు, సబ్‌ మెరైన్లతో యుద్ధంలోనూ సీహాక్‌లను మించినవి లేవు. రోమియో హెలికాప్టర్లు ఇండియన్ నేవీలో చేరితే భారత నౌకా దళం మరింత పటిష్టం అవుతుంది. ఆర్మీకి అందించే అపాచీ హెలికాప్టర్లు కూడా యుద్ధంలో కీలకం. ఉన్న చోటి నుంచే కదలకుండా మిస్సైళ్లను ప్రయోగించడం, క్షణాల్లో దిశను మార్చుకుని పోరాడటంలో ఈ హెలికాప్టర్లకు సాటి రాగలిగనది లేదు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: