ఏదైనా ఈవెంట్లు  జరిగిన.. ఏదైనా మీటింగ్ లు  జరిగిన భద్రత కల్పించాల్సిన పోలీసులు .. తప్ప తాగి అదరగొట్టే స్టెప్పులతో రెచ్చిపోయారన్న వార్త ఈ మధ్య హల్ చల్ చేసింది. తప్పుడు మార్గంలో నడిచే వారిని మందలించాల్సిన పోలీసులు మందేసి చిందేస్తూ మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయినా సంగతి తెలిసిందే. అసలు మ్యాటరెంటో .. వీరి డ్యాన్సులు చూసి పొలిసు డిపార్ట్మెంట్ ఏముందో అన్న విషయం ఆసక్తగా మారింది. 

 


చట్టాన్ని నాలుగు పాదాల మీద నిలుచోబెట్టి నడిపిస్తూ  పరిరక్షించాల్సిన అధికారులే ఉల్లంఘిస్తున్న తీరు ఇది . బహిరంగంగా పోలీసులు చేస్తున్న బ్యాంకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులకు నెట్టి వేస్తున్నాయి. మందేసి చిందేసిన పోలీస్ అధికారుల పైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ గా వ్యవహరించారు.  బహిరంగ ప్రదేశంలో డ్రంక్ అండ్ డాన్స్ చేసిన పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

 

 

కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆరుగురు పోలీస్ అధికారులను హెడ్ కోటర్స్ కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆర్డర్  ఇచ్చారు.  నిన్న మీడియాలో వైరల్ ఐన పోలీసుల డ్రంక్ అండ్ డాన్స్ వీడియో పైన సీరియస్ అయ్యారు. దీనిపైన సమగ్ర విచారణకు ఆదేశించారు.  ఆరుగురు పోలీస్ అధికారులు కలిసి స్థానికంగా ఉన్న ఒక వెంచర్ లో మద్యం తాగి డ్యాన్స్ చేసినట్టుగా గుర్తించారు.  అంతేకాకుండా అధికారులు మద్యం సీసాలను నెత్తిపై పెట్టుకుని నాగిని డాన్స్ చేశారు . 

 

అదే మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి హంగామా చేసిన వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి . దీని ఆధారంగా సీపీ సజ్జనార్ వెంటనే విచారణకు ఆదేశించారు.  దీనిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఆరుగురు పోలీస్ అధికారుల పైన బదిలీ వేటు వేస్తూ ఆయా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.అంతేకాకుండా ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: