వైసీపీ క్యాబినెట్ మీద అనేక విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. అంతెందుకు ముఖ్యమంత్రి జగన్ని కూడా నానా మాటలు అంటున్న వారు ఉన్నారు. విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలో ఓ టీడీపీ తమ్ముడు ఏకంగా వైసీపీకి చెందిన మంత్రి గారిని  ఒకరిని పట్టుకుని కమెడియన్ అనేశారు. ఇది నిజంగా దారుణమైన జోకే. 

 

వైసీపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ కమెడియన్ అంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. తాము వైసీపీలో ఓ మంత్రి గారిని ముద్దుగా కమెడియన్ అని పిలుచుకుంటామని ఆయన మీడియా ముందే చెబుతున్నారు. అంటే వైసీపీలో ఆ మంత్రి గారి పనితీరు కామెడీగా ఉందా. లేక మరేదైనా పట్టుకుని  అలా మాట్లాడుతున్నారా అంటూ వైసీపీ నేతలు మరో వైపు మండిపోతున్నారు.

 

అవన్నీ పక్కన పెడితే కమెడియన్ అని బాధ్యత కలిగిన మంత్రిని పట్టుకుని ఎలా అంటారని కూడా ప్రశ్న వస్తోంది. నిజానికి మంత్రులు ఎవరి బాధ్యతలు వారు చేయకుండా వ్యవహిరిస్తున్నారన్న విమర్శలు గతంలో కూడా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ జమానాలో ఎంతమంది కమేడియన్లు ఉన్నారో అంటున్నారు వైసీపీ నేతలు.

 

మొత్తానికి తాను మంచి పనిమంతుడిని అని చెప్పుకుంటూ విశాఖ రాజకీయల్లో తనదైన ముద్ర వేయాలని ఓ వైపు అవంతి శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నం చేస్తూంటే టీడీపీ ఇలా కమెడియన్ అంటూ పక్కన పెట్టడం నిజంగా ఘాటు విమర్శగానే చూడాలి. దీనికి మంత్రి అవంతి ఏమంటారో చూడాలి.

 

ఇక రాజకీయాల్లో భాష కూడా మారిపోతోంది. విమర్శలు కూడా దారుణంగా ఉంటున్నాయి. అవి ఇలా ఇపుడు సెటైర్లు కూడా దాటేసి ఇంకా దూరం వెళ్ళడం పైన తటస్థులు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదని కూడా హితవు పలుకుతున్నారు. వీటికి ఎక్కడో అక్కడ కట్టడి వేయాలని కూడా సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: