ఈ వారం అతి చేసిన నాయకుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా ప్రస్తావించాల్సింది అమెరికా అధ్యక్షుడు ట్రంపు గురించే.. ఆయన తన ఇండియా పర్యటన సందర్భంగా పలు సార్లు అతి చేశారు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షుల కంటే.. ట్రంప్ చాలా ఓవర్ చేశారనే చెప్పుకోవాలి. అసలు పర్యటన ప్రారంభం కాక ముందే.. అమెరికాలోనే ఆయన ఓవర్ గా కామెంట్లు చేశారు. ట్రంపు తనకు కోటి మందితో స్వాగతం పలుకుతాడని చెప్పారంటూ ఓవర్ యాక్షన్ చేశారు.

 

 

ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా ట్రంప్ కాస్త ఎక్కవే చేశాడని చెప్పాలి. గతంలో వచ్చిన ప్రెసిడెంట్లు హుందాగా ప్రసంగించగా.. ట్రంప్ మాత్రం.. తన ప్రసంగం ఆసాంతం ఇండియాను ఆకాశానికెత్తేలా కొనసాగించారు. అంతే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత సబర్మతి ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ సందర్శనకుల పుస్తకంలో కనీసం గాంధీ గురించి ఒక్క మాట కూడా రాయకుండా ఓవర్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో.. తర్వాత రోజు రాజ్‌ ఘట్ లో మాత్రం గాంధీ గురించి నాలుగు మంచి మాటలు రాశారు.

 

 

ఇక ట్రంప్ తర్వాత కాస్త ఎక్కువ చేసిన నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి చెప్పుకోవచ్చు. ఆయన తన విశాఖ పర్యటన సందర్భంగా సానుభూతి కోసం డ్రామా ఆడినట్టు విమర్శలు వచ్చాయి. విశాఖలో తన పర్యటనను అడ్డుకుంటున్నా.. ఆయన పాదయాత్ర చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు మొత్తుకుంటున్నా అక్కడ నుంచి కదలకుండా.. ఓవర్ యాక్షన్ చేశారన్న విమర్శలు వచ్చాయి.

 

 

దీనికి తోడు విశాఖలోని వైసీపీ నేతలు కూడా చంద్రబాబుకు దీటుగా నే ఓవర్ యాక్షన్ చేశారని చెప్పాలి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ గందరగోళం చేశారు. ఇలాంటి చర్యల వల్ల విశాఖ పట్నం బ్రాండ్ ఇమేజ్ పాడవుతుందన్న స్పృహ లేకుండా చేశారు. చంద్రబాబు రోడ్డుపై బైటాయించడం.. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కొందరు చెప్పులు, రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు విసరడం అంతా ఓవర్ యాక్షనే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: