ఆయన ఓ ఐపీఎస్.. సబ్ కలెక్టర్ గా చేస్తున్నారు. అయితే అతనికి ఉన్న డిమాండ్ ఈ కాలంలో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వలో కలెక్టర్ రేంజ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూడటం మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో మంచి అమ్మాయి పైగా డాక్టర్ చదువుకుంది.. ఇంకేముంది ఇద్దరు మంచి విద్యావంతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  సాధారణంగా ఆ స్థాయి పెళ్లి కుమారుడికి కట్నం ఇవ్వాలనుకుంటే పెద్ద ఎత్తున ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.  అయితే ఈ విషయం పెద్దలు కాదు.. పెళ్లి కుమారుడే జోక్యం చేసుకున్నాడు.. తన కట్నం గురించి డైరెక్ట్ గా పెళ్లి కూతురు కి చెప్పాడు. 

 

మొదట లేడీ డాక్టరమ్మ అతని కోరిక విని షాక్ తిన్నారు.. తర్వాత తేరుకొని నిజంగా ఇంత గొప్ప ఆదర్శ భావాబాలు.. మానవత్వం ఉన్న భర్త తనకు దొరకడం పూర్వ జన్మ సుకృతం అనుకుంది తర్వాత వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక వరుడు పేరు ప్రభాకర్ సబ్ కలెక్టర్ గా చేస్తున్నాడు. వధువు పేరు డాక్టర్ కృష్ణ భారతి ప్రస్తుతం వైద్యురాలిగా కొనసాగుతుంది. అంతా బాగుంది కానీ.. ఇంతకీ ఈ సబ్ కలెక్టర్ వరుడు ఏం అడిగారో తెలుసా? వారంలో రెండు రోజుల పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, అదే తనకిచ్చే కట్నమని చెప్పాడు. అది కూడా తన స్వగ్రామమైన ఒట్టంకాడు, దాని పరిసర గ్రామాల్లోనే చేయాలని సూచించాడు.

 

దీనికి ఆమె, ఆమె తల్లిదండ్రులూ అంగీకరించారు. అయితే సబ్ కలెక్టర్ గా ప్రభాకర్ మామూలు పరిస్థితిలో రాలేదు.  ఆయన తల్లిదండ్రులు కూలీలుగా పనిచేసేవారు.. చిన్న నాటి నుంచి చదువు పట్ల ఆసక్తితో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ స్థానానికి వచ్చాడు.  ఆయన గ్రామంలో వైద్య సహాయం లేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడటం చిన్ననాటి నుంచి చూశాడు.. అందుకే తన వంతు సహాకంగా తన భార్య ద్వారా సేవ చేయాలని మంచి మనసు చాటుకున్నాడు.  వీరి ఆదర్శ వివాహానికి ఇప్పుడు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: