చైనా నుంచి ఎది మన దేశానికి వచ్చిన కూడా అవి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి.. అదే ఇప్పుడు కూడా జరిగింది.. టిక్ టాక్ ద్వారా ఏర్పడిన ప్రేమ చివరికి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది..ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది.. తన ప్రేమను అమ్మాయి నిరాకరించిందని అతడు రైలు క్రింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు అనే ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

వివరాల్లోకి వెళితే,.. సామర్లకోట మండలం మేడపాడు సమీపంలో రైలు క్రింద పడి బర్రె శేఖర్ అనే యువకుడు ఆత్మహత్య.చేసుకున్నాడు.. ఈ ఘటన సామర్లకోట మండలం వేట్లపాలెం పంచాయితీ హరిజన పేటకు చెందిన  శేఖర్ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన టిక్ టాక్. అయితే తన ప్రేమ ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడిన శేఖర్. ప్రస్తుతం ఈ ఘటన స్థానికులను ఆలోచింప జేస్తుంది. 

 

 

గత వారం రోజులుగా ప్రియురాలి కోసం టిక్ టాక్ వీడియోలు చేస్తున్న శేఖర్. ఛాతీ పైన ప్రియురాలి ట్యాట్టూ వేయించుకొని వీడియోలను చేసాడు. నిన్ను వేరొకరితో ఊహించుకోవడం నరకంగా ఉందంటూ వీడియో చేసి టిక్ టాక్ లో పెట్టిన శేఖర్. ఆరు నెలల తరువాత అయినా నా ప్రేమను అర్ధం చేసుకుంటావంటూ చివరి వీడియో చేసి టిక్ టాక్ లో పెట్టిన శేఖర్. ఆత్మహత్యకు ముందు వీడియోలు చేసి టిక్ టాక్ లో పెట్టి రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన భగ్న ప్రేమికుడు శేఖర్.

 

 

అసలు విషయానికొస్తే ... బైక్ ఫైనాన్స్ కట్టలేక శేఖర్ ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని ముందుగా అనుకున్న బంధువులు. శేఖర్ టిక్ టాక్ వీడియోలు చూసి అవాక్కవుతున్న బంధువులు.సామర్లకోట మండలం మేడపాడు సమీపంలో రైలు క్రింద పడి బర్రె శేఖర్ అనే యువకుడు ఆత్మహత్య. ఆ వీడియోలు ఇప్పుడు సోసిల్ మీడియాలో ఈ వీడియోలను చుసిన ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: