మనలో ప్రతిరోజు చికెన్ తినేవారు లేకపోలేదు. మాంసహార ప్రియులు ఎక్కువగా చికెన్ తింటారు. చికెన్ ధర కూడా తక్కువే ఉంటుంది. కానీ మార్కెట్ లో దొరికే చికెన్ వల్ల మన శరీరానికి కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కోళ్ల పెంపకం దారులు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. లాభాపేక్ష కోసం వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. 
 
సాధారణంగా కోడి పిల్లలు పెరగటానికి 50 - 60 రోజుల సమయం పడుతుంది. కొందరు వ్యాపారులు కోడి పిల్లలకు జన్యుపరమైన ఇంజక్షన్లు ఇచ్చి 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. ఇలా పెరిగిన కోళ్లలో ఊపిరితిత్తులు, గుండె, కాళ్లలో సరైన ఎదుగుదల ఉండదు. ఇంజక్షన్ల వల్ల కొన్ని కోళ్లు చనిపోయి వాటి కాళ్ల దగ్గర కురుపులు వస్తున్నాయి. ఈ కోళ్లతో తయారైన చికెన్ తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 
 
హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వల్ల వేగంగా పెరిగిన కోళ్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక చారిటీ సంస్థ అధ్యయనంలో 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70రోజుల సమయం పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఎదుగుతున్నాయి. చారిటీ సంస్థ ఇప్పటికే కెఎఫ్‌సీ, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్, వెయిట్‌రోస్‌ సంస్థలకు ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలని కోరింది. 
 
చారిటీ అధ్యయనంలో అతివేగంగా పెరిగే కోళ్లు అనారోగ్యానికి గురై చనిపోతున్నట్టు తేలింది. లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ లాంటి ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల చికెన్ తినే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. వెంటనే దాని ప్రభావం తెలియకపోయినా దీర్ఘ కాలంలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఇంజక్షన్ల ప్రభావం కోడి మిగతా భాగాల కంటే మెడపై, రెక్కలపై ఎక్కువగా ఉంటుంది. చికెన్ తినేవారు ఈ రెండు భాగాలకు దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: