వైరస్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతున్నది.  ఈ వైరస్ కారణంగా వేలాదిమంది  మరణించారు.  ఈ మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఇప్పుడు మరొక భయం ప్రతి ఒక్కరిని పట్టుకుంది.  అదేమంటే వైరస్ వలన కలిగే అనర్ధాల కంటే కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరి ఎలా వ్యాపిస్తుంది.  అలా వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం.  


ముందుగా వైరస్ సోకకుండా ఉండాలి అంటే తప్పకుండా చేతులకు , ముక్కులకు మాస్క్ వేసుకోవడం తప్పనిసరి.  అలా వేసుకోకుంటే ఇబ్బందులు వస్తాయి.  ఒకరి మరొకరికి వైరస్ సోకుతుంది.  అందుకే ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.  అంతేకాదు, వైరస్ నుంచి బయటపడాలి అంటే, ముఖ్యంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.  ఎప్పటికప్పుడు చేతులను కడుక్కోవడం చాలా అవసరం. 


అంతేకాదు,   షేక్ హ్యాండ్ వంటివి ఇవ్వడం పక్కన పెట్టి చేతులు జోడించి నమస్కారం చెప్పడం మంచిది.  ఇప్పుడు ఏ వైరస్ హైదరాబాద్ కు సోకింది.  ప్రస్తుతం ఆ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.   ప్రతి ఒక్కరు  కూడా  ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  తీసుకునే జాగ్రత్తలను బట్టి వైరస్ ఎటాక్ అనేది ఉంటుంది.  ఏం చేసినా జాగ్రత్తలు తీసుకొని చేయడం మంచిది. 


ఇకపోతే, వైరస్ నుంచి బయటపడటానికి  ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి.   వాటిని తూచా తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరంఉంది .  అందులో ముఖ్యంగా  మాములుగా ఈ వైరస్ కు మనిషిని చంపేంత శక్తి లేదు.  కానీ, వ్యక్తికీ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వైరస్ ఎటాక్ అయితే  దానివల్ల అతను మరణించే అవకాశం   ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఈ వైరస్ వలన ఇప్పటికే ప్రపంచంలో 3000 మందికి పైగా మరణించారు.  67 దేశాల్లో ఈ వైరస్ సోకింది.   కాబట్టి  అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: