ఎండాకాలం ఆరంభంలో ఏడాది పరీక్షలు జరుగుతాయి.  ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని సిద్ధం చేసుకుంది.  మార్చి 4 నుంచి పరీక్షలు కావాల్సి ఉన్నది.  ఈ సమయంలో హైదరాబాద్ లో కరోనా ఉన్నట్టుగా తేలడంతో తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు.  కరోనా అంటేనే ఇప్పుడు ప్రపంచం భయపడుతున్నది.  అలాంటిది పిల్లలు భయాడటంతో తప్పులేదు.  చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పెట్టినట్టుగా కనిపించిన గత ఆదివారం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.  


కేసులు సంఖ్య మరలా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇదిలా ఉంటె, హైదరాబాద్ లో వైరస్ ఉండటం అందరిని భయాందోళనలకు గురి చేస్తున్నది.  ఎందుకంటే వైరస్ వలన చాలా ఇబ్బందులు వస్తాయి.  ఇప్పుడు  ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాల్సిన అవసరం ఉన్నది.  మాస్క్ లు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది.  మాస్క్ లు ఉంటె కొంతవరకు రక్షణ.  


అయితే, ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.  అదేమంటే మాస్క్ లు ధరించడం వలన వైరస్ కు కొంతవరకు అడ్డుకట్ట వెయ్యొచ్చు.  కానీ, ఇప్పుడు ఆ మాస్క్ ల దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది.  మాస్క్ ల భయం వెంటాడుతున్నది.  కరోనా ఉందని తెలియగానే హైదరాబాద్ లో మాస్క్ లకు రెక్కలు వచ్చాయి.  దుకాణంలో భారీ ధరలకు అమ్ముతున్నారు.  ఏ మాస్కులు పడితే వాటిని వాడితే ఉపయోగం లేదు.  


సర్జికల్ మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉన్నది.  ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది తెలియాల్సి ఉన్నది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు అధికారులు.  అయితే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రికాషన్స్ తీసుకోవాలి.  వైరస్ బారి నుంచి బయటపడేందుకు సదా సిద్ధంగా ఉండాలి.  అప్పుడే వైరస్ నుంచి బయటపడొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: