రాజకీయ ప్రత్యర్థులనే కాదు సొంత పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను తరచుగా అనేక విషయాల్లో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ భయపెడుతూనే ఉంటారు. ఎక్కడా అలసత్వం అనేది పార్టీలోనూ, ప్రభుత్వంలోను కనిపించకూడదని, ప్రజలంతా టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకోవాలని కేసీఆర్ ఆశపడుతూ ఉంటారు. ఆ మేరకు పార్టీ శ్రేణులను కూడా ఆ విధంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఎవరి పని తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు కేసీఆర్ తరచుగా సర్వేలు చేయిస్తూ ఉంటారు. ఆ సర్వే ఆధారంగానే ఆయన నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టేందుకు, ప్రవేశపెట్టిన తర్వాత వాటి అమలు తీరు, ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు కేసీఆర్ సర్వేలను ఆశ్రయిస్తుంటారు. 

 

IHG


తాజాగా మరో రెండు రకాలు సర్వేలను కెసిఆర్ ఇప్పుడు చేయిస్తుండడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సర్వేల రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం తో పాటు ఓ ప్రైవేటు సంస్థ కు కూడా ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో తెలంగాణ క్యాబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి పనితీరుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సమాచారం సేకరించి, నివేదిక తయారు చేస్తారట. ఆ నివేదిక అందిన తరువాత వాటిని క్యాబినెట్ మంత్రులకు ఇవ్వడంతోపాటు, మంత్రుల పనితీరు ఆధారంగా ఏ బి సి డి లుగా విభజించి నివేదికలు అందజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

 

IHG


అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నివేదిక అందే సమయం వరకు ఎవరి పనితీరు ఏ విధంగా ఉందో పూర్తిగా రిపోర్టులు రాబోతున్నాయి. వాటి ఆధారంగా కొంత మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించాలని చూస్తున్నారు. అలా తప్పించిన వారికి కూడా నివేదికను చూపించి ఈ నివేదిక ఆధారంగానే తొలగించామని చెప్పాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ చేతికి అందగానే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. మొత్తం ఈ వ్యవహారమంతా కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: