ఓటమి ఎదురైన వెనక్కితగ్గకుండా కష్టపడితే విజయం సాధించవచ్చని ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ నిరూపించారు. స్వతహాగా రియల్ ఎస్టేట్ బిల్డర్ అయిన బుర్రా, 2014 ఎన్నికలకు ముందు వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో జగన్ పార్టీలో చేరారు. ఆర్ధిక బలంతో పాటు, జిల్లాలో బిల్డర్‌గా మంచి పేరు ఉండటంతో, 2014 ఎన్నికల్లో కనిగిరి సీటు దక్కించుకున్నారు. అయితే టికెట్ దక్కిన విజయం మాత్రం దక్కలేదు. టీడీపీ అభ్యర్ధి కదిరి బాబూరావు చేతిలో 7 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

ఇక ఓటమి వచ్చిన, వెనక్కి తిరగకుండా నియోజకవర్గంలోనే పని చేసుకున్నారు. ప్రజలకు అండగా నిలిచారు. పైగా టీడీపీ ఎమ్మెల్యేపై రోజురోజుకు వ్యతిరేకిత పెరిగిపోవడం బుర్రాకు కలిసొచ్చింది. అయితే కదిరి మీద వ్యతిరేకిత రావడంతో చంద్రబాబు, ఆయన్ని దర్శి పంపి, కనిగిరిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని  బరిలోకి దింపారు. కానీ అభ్యర్ధి ఎవరున్న విజయం మాత్రం బుర్రాకే దక్కింది. దాదాపు 41 వేలపైనే మెజారిటీతో విజయం సాధించారు.

 

భారీ మెజారిటీకి తగ్గట్టుగానే బుర్రా ప్రజల కోసం కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్న పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కూడా పెన్షన్, రేషన్ కార్డుల్లో సమస్యలు ఉంటే ఆయనే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ పథకం మీద ప్రజలకు అవగాహన కలిగిస్తూ, అర్హులకు అందేలా చేస్తున్నారు. ఇటు పార్టీ పరంగానే కాకుండా సొంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

 

అయితే బుర్రా ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సాగర్‌ నల్లా అందించే కార్యక్రమం చేపడతా అన్నారు. కానీ ఇంకా ఆ కార్యక్రమం ఆచరణలో లేనట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ నల్గొండ తర్వాత ఫ్లోరైడ్‌ సమస్య అత్యధికంగా కనిగిరిలోనే ఉంది. ఈ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. ఈ సమస్యకు కూడా పూర్తిగా పరిష్కారం అందించాల్సి ఉంది. పీసీపల్లి మండలంలో ఈ సమస్యలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ సమస్యలపైన బుర్రా గట్టిగా పని చేయాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: