చైనాలో మొదలైన కరోనా వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తుంది. ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తూ వేల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పుడు ఈ వ్యాధి మన దేశంలోకి అడుగు పెట్టింది. కరోనా.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన దేశంలో అడుగు పెట్టింది. అసలు ఈ వ్యాధి మన దేశంలో ఎలా వ్యాపించింది..?

 

దేశంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి రాజస్థాన్ వచ్చిన పర్యాటకుడికి కరోనా సోకినట్టు గుర్తించారు. సోమవారం కోవిడ్ లక్షణాలతో ఇటలీ పర్యాటకుడు జైపూర్‌ లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్‌లో చేరారని అధికారులు తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అనే తేలిందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకి చేరింది. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్‌ లో మరొకరికి కరోనా సోకినట్టు సోమవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఆగ్రాకు చెందిన ఇద్దరు సోదరులు వ్యాపారం నిమిత్తం గత నెలలో ఇటలీ వెళ్లి వచ్చారు. వీరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వీరిద్దరితోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను ఢిల్లీకి తరలించారు. వీరిద్దర్నీ ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉండాలని సలహా ఇచ్చారు.

 

కరోనా వైరస్ బారిన పడ్డ హైదరాబాదీ ఆరోగ్యం మెరుగైందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. అంతకు ముందు విదేశాల నుంచి కేరళ తిరిగొచ్చిన ముగ్గురికి కరోనా వైరస్ సోకగా వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించడంతో వ్యాధి నయమైంది. ప్రపంచవ్యాప్తంగా 88 వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: