జీతం పెరిగే కొద్దీ టాక్స్ కట్టాల్సిన పరిధిలోకి మీరు వస్తారు. అయితే టాక్స్ ఎందుకు కట్టాలి. దేశం కోసం.. మరి ఈ దేశం మనకు ఏమిచ్చింది.. ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. సంక్షేమ పథకాల పేరుతో విచ్చలవిడిగా పథకాలు ఉన్న తరుణంలో జీతం 40 వేలు దాటిన ఓ ఉద్యోగి ఆవేదన ఇది.

 

 

ఓ మధ్యతరగతి వాడా...ఇన్కమ్ టాక్స్ కట్టాలి అనుకుంటున్నావా.. అయితే మనకి బొక్క పడినట్టే... ప్రభుత్వం చేయబట్టి నాలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుండి టాక్స్ కట్టడం మనేయాలి అనుకుంటున్నాం....ఎందుకో తెలుసా.....నువ్వు నిజాయితీగా కట్టే టాక్స్ వల్ల

అమ్మ వడి 15000 నీకు రావు, ఐటీఐ , డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రావు..

 

 

రైతు భరోసా 12000 రావు....పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు.. బియ్యం కార్డు నీకు రాదు, 20kgx50rsx12months 12000 పెట్టి బియ్యం కొనాల్సిందే.. ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు.. ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల రూపాయలు నీకు రావు.. డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు.. ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు.. ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే..

 

 

నీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు... నువ్వు కట్టాలి... ఇక నీ పిల్లలు ఇంజనీరింగ్ లేక ఎంబీబీ యస్ చదువు? ఒక కలే.. అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే ...టాక్స్ కట్టే పని లేదు....ప్రభుత్వం నుండి నిరు ద్యోగ భృతి తో పాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు..

 

ఇప్పుడు చెప్పండి ఈ ఆవేదనలో అర్థం ఉందా.. ఈ ఆవేదనలో న్యాయం ఉందా.. ఆర్థికంగా వెనుకబడిన వాడిని ఆదుకోవాల్సిందే అందులో వేరే మాట లేదు. కానీ విచ్చలవిడిగా పెట్టే పథకాలు ఇలా టాక్స్ కట్టేవారికి గుదిబండగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: