కరోనా.. ఓ చిన్న వైరస్ కానీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకూ కరోనా ఆ దేశంలో ఉంది.. ఈ దేశంలో ఉంది. అని చెప్పుకోవడమే కానీ.. ఇండియాను పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. ఏవో ఒకటీ అరా కేసులు ఉన్నా.. అవి కూడా నయమైపోయాయి.. ఇలా అనుకున్న తరుణంలో ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరగడం భయాందోళనలకు దారి తీస్తున్నాయి.

 

 

అయితే ఈ వైరస్ ఎందుకు వ్యాపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపిస్తుంది.. అనే విషయాలు తెలుసుకంటే అందరికీ ఉపయోగం. ఏ వైరస్‌ అయినా జన సాంద్రత ఎక్కువగా ఉన్నచోట చాలా వేగంగా విస్తరిస్తుంది. మన ఇండియాలనూ జన సాంద్రత ఎక్కువే కాబట్టి ఇండియాలో ఈ వైరస్ వ్యాపించే అవకాశం మెండుగానే ఉంది.

 

 

సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ లు ఎక్కువగా వ్యాపించవు. వింటర్ లోనే వైరస్‌ విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. కాని ఇది అన్నిసార్లు నిజం కాదు.. ఎందుకంటే.. ఈ కరోనా.. భారత్‌లో కన్నా ఎక్కువ వేడి ఉండే సౌదీ అరేబియాలోనూ కరోనా విజృంభిస్తోంది. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారితో ఇది వ్యాప్తి చెందడం మొదలైంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ అంత చురుకుగా ఉందంటే కరోనా కెపాసిటీని తక్కువగా అంచనా వేయకూడదు.

 

 

మన భారత్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే భారత్‌కు కరోనా వైరస్‌ రాదని ప్రభుత్వం ఇన్నాళ్లూ ధీమాగా ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎండలోనూ వైరస్‌ విస్తృతమవుతోంది. జనంలో ఎవరైనా వైరస్‌ ఉన్నవారు ఉంటే వారు దగ్గినా, తుమ్మినా అప్పుడు వచ్చే తుంపర్లతో వైరస్‌ వ్యాపిస్తుంది. అందుకే ఫ్లూ తరహా రోగం ఉన్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్తే మాస్కు ధరించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: