ప్రధానమంత్రి నరేంద్రమోడికే జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చాడు. ఎన్ఆర్సి అమలు అబయన్స్ లో పెడుతూ ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఎన్ఆర్సీ అమలు విషయంలో ముస్లిం మైనారిటిల్లో ఉన్న అనుమానాలు, ఆందోళనలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధత్య ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఎన్ఆర్సీలో భాగంగా కేంద్రం జారీ చేసిన ప్రశ్నవాళిపై ముస్లిం సోదరుల్లో ఉన్న ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.

 

ప్రశ్నావళిలోని కొన్ని ప్రశ్నలను తొలగించాలని, మరికొన్ని ప్రశ్నలపై వివరణ కోరాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. కేంద్రప్రభుత్వం నుండి సమాధానం వచ్చేంత వరకూ ఎన్ఆర్సీ అమలును నిలిపి వేయాలని కూడా నిర్ణయించింది. క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంతో ముస్లిం మైనారిటిలు ఫుల్లుగా హ్యాపీగా ఫీలవుతారనటంలో సందేహం లేదు. అదే సమయంలో  ఎన్ఆర్సీ ప్రశ్నావళిపై వివరణ కోరటమన్నది కేంద్రానికి షాక్ ఇచ్చేదే.

 

ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఏ లాంటి బిల్లులపై దేశవ్యాప్తంగా ఎంత వివాదం నడుస్తోందో అందరూ చూసిందే.  ఇదే విషయమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరగటం సుమారు 45 మంది చనిపోవటం అందరూ చూసిందే. ఇంతటి సున్నితమైన అంశాలపై దేశంలోని చాలా రాష్ట్రాల్లో అనుమానాలు ఉన్నట్లే ఏపిలో కూడా అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. అందుకనే వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని క్యాబినెట్ కోరింది.

 

ఎన్ఆర్సీ ప్రశ్నావళిపై అనుమానాలున్నాయంటూ రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని వివరణ కోరటం అన్నది అసాధారణమనే చెప్పాలి. పైగా ప్రశ్నావళిపై వివరణ వచ్చేంత వరకూ దాని అమలును పక్కన పెట్టేయాలని క్యాబినెట్ నిర్ణయించటం ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించటం కూడా మామూలు విషయం కాదు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం నిలుపుదల చేయాలని డిసైడ్ చేయటమంటే చిన్న విషయం కాదు. మరి రాష్ట్ర క్యాబినెట్ లేవనెత్తిన సందేహాలపై కేంద్రం ఎప్పటికి వివరణ ఇస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: