గత సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలోని వ్యూహన్ నగరంలో కరోనా వైరస్ కనిపెట్టగా... దాని వలన ఇప్పటికే 3000 మందిపైగా చనిపోగా... 90 వేల మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. ఐతే ఇన్ని నెలలుగా కరోనా వైరస్ (కోవిద్ 19) జబ్బు ప్రపంచ దేశాలను వణికిస్తున్నా దానిని అరికట్టడానికి ఇంతవరకు ఏ మందు గానీ చికిత్స గానీ కనుగొనబడలేదు. ప్రస్తుతం చైనాలో ఒకవైపు వైరస్ సోకిన వారు మృత్యువుతో పోరాడతుండగా... మరోవైపు వైరస్ సోకని వారు జాగ్రత్తలు తీసుకులేక నానా తిప్పలు పడుతున్నారు. ఆఖరికి డబ్బులను చూసినా వారికి కరోనా మహమ్మారే కనిపించి నిద్రలేకుండా చేస్తుంది. అవును, ఒక చైనీస్ మహిళ తన కరెన్సీ నోట్లకి కరోనా వైరస్ అంటుకుందేమోనని వాటిని మైక్రోవేవ్ ఓవెన్ లో వేసి వైరస్ పోగొడదామనుకుంది కానీ ఆమెకు చేదు అనుభవమే మిగిలింది. ఈ సంఘటన వుక్సీ ప్రావిన్స్‌లోని జియాంగిన్ సిటీ లో చోటుచేసుకుంది.




వివరాలు తెలుసుకుంటే... ఆంట్ లీ అనే ఒక మహిళ తను బ్యాంకు నుండి తెచ్చుకున్న కరెన్సీ నోట్లకు వైరస్ అంటుకొని ఉంటుందని తెగ కంగారుపడిపోయింది. ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బులని క్లీన్ చేసి వైరస్ ని పోగొట్టాలని RMB.3000 (రూ. 31, 000) లని మైక్రోవేవ్ఓవెన్ లో పెట్టి స్విచ్ ఆన్ చేసింది ఆమె. ఐతే క్షణాల్లోనే మైక్రోవేవ్ ఓవెన్ నుండి మాడిపోయిన వాసనా వచ్చింది. దీంతో ఆమె పరుగుపరుగున వచ్చి ఒవేన్ ఓపెన్ చేసి చూడగా... నోట్లన్నీ నల్లగా మాడిపోయి కనిపించాయి. దీంతో ఆమెకు గుండె పగిలినంత పనేయింది.




వెంటనే ఆ కాలిపోయిన నోట్లని బ్యాగ్ లో వేసుకొని బ్యాంకు కి వెళ్లి తాను చేసిన సిల్లీ పని గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేయగా...  కరెన్సీ నోట్లని పరిశీలించిన బ్యాంకు అధికారులు... కొన్ని నోట్లు పట్టుకుంటే మసి అయిపోయేలా ఉన్నాయని, మిగతావి నల్లగా మారిన బాగానే ఉన్నాయని చెప్పారు. దాంతో ఆమె కొన్ని పద్ధతులని పాటించి RMB.1500 వరకు మంచి కరెన్సీ నోట్లని పొందగలిగింది. ఏదేమైనా చైనీస్ ప్రజలు ఎంతగా భయపడుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: