వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదాలతో వార్తల్లో నిలిచే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో అధికారులపై, పోలీసులపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన జేసీ ఈసారి ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. జేసీ ఏపీలో మరికొన్నిరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. 
 
స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, ఎన్నికల్లో తాను, తన అనుచరులు పోటీ చేయరని స్పష్టం చేశారు. జేసీ టీడీపీ అనుమతితోనే ఈ వ్యాఖ్యలు చేశారా...? అనే విషయం తెలియాల్సి ఉంది. జేసీ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 99 శాతం మంది ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుస్తారని జోస్యం చెప్పారు. ఒకరకంగా ఈ వ్యాఖ్యలు టీడీపీని ఇబ్బంది పెట్టేవే. జేసీ జగన్ పరిపాలనపై పాజిటివ్ కామెంట్లు చేశారు. 
 
ఏపీలో జగన్ పరిపాలన చాలా బాగుందంటూ ప్రశంసించారు. జగన్ ఎన్నికల్లో గెలిచినా మద్యం, డబ్బు పంచితే గెలిచిన నాయకులను జైలులో పెడతామని చెబుతున్నారని పోటీ చేసి భవిష్యత్తులో ఇబ్బందులు పడే బదులు పోటీకి దూరంగా ఉంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీ, టీడీపీ నేతలు జేసీ వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
వైసీపీ ఈ నెలాఖరు లోపు స్థానిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది. జగన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను ఇంఛార్జీ మంత్రులకు అప్పగించారు. ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని జగన్ హెచ్చరించారు. జగన్ మంత్రులకు 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుందని సమాచారం.        

మరింత సమాచారం తెలుసుకోండి: