ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అసలు ఇలా ఎక్కడైనా ఉంటాయా అని తెలుగుదేశం నేతలు పదే పదే ప్రశ్నించారు. అయితే ఇదేమీ కొత్త విషయం కాదన్న సంగతి తెలిసిందే. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, రాజధాని మరో చోట ఉన్నాయి. అంటే ఒక విధంగా రెండు రాజధానులన్న మాట.

 

 

ఈ థియరీని జగన్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి మూడు రాజధానులు చేశారు. జగన్ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అనేక జాతీయ మీడియాలు ఈ అంశంపై చర్చలు నిర్వహించాయి. అయితే ఇప్పుడు మరో రాష్ట్రం జగన్ ఫార్ములాను అనుసరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

IHG

 

బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ లోనూ మూడు రాజధానులు ఉంటాయా? అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి రాజధానిగా డెహ్రాడూన్ తాత్కాలికంగా కొనసాగుతోంది. అయితే గెర్సాయిన్ కు రాజధాని మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రావత్... గెర్సాయిన్ వేసవి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. అంతే కాదు.. అక్కడ అందుకు అనుగుణంగా నిర్మాణాలు సాగుతున్నాయని ప్రకటించారు.

 

 

గమనించాల్సింది ఏంటంటే.. ఉత్తరాఖండ్ లో ఆ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్ లో ఉంది. అంటే ఉత్తరాఖండ్ సీఎం ప్రకటన ప్రకారం.. డెహ్రాడూన్‌ సాధారణ రాజధానిగా... గెర్సాయిన్ వేసవి రాజధానిగా ఉంటాయన్న మాట.. ఇక నైనిటాల్ ఎలాగూ హైకోర్టు ఉంది కాబట్టి న్యాయ రాజధాని అవుతుంది.. సో.. ఆ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు కాబోతున్నాయన్నమాట. అయితే ఈ విషయంపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉందనుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: