కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందటంతో.. ఈ ప్రభావం కేవలం ప్రాణనష్టం మీదనే కాక రాష్ట్రంలో వివిధ రంగాలకు ఆస్తినష్టం వాటిల్లుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సహా కుదేలవుతున్నాయి. అయితే.. ఈ ప్రభావం ఎక్కువగా కోళ్ల పరిశ్రమ మీద పడి బాగా దెబ్బతిన్నది. అంతేకాక ఈ దెబ్బతో గ్రానైట్, ఫార్మా, హోటల్స్.. అన్ని పరిశ్రమలూ నష్టపోతున్నాయి. 

 

 

అయితే.. అత్యధిక ప్రభావం మాత్రం పౌల్ట్రీ రంగంలోనే ఉందట. గతేడాదిలో చైనాలో కరోనా విస్తరించినపుడు ఆ ప్రభావం ఇక్కడ పడిన కానీ.. నష్టం మాత్రం తక్కువగానే ఉంది. అయితే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించడంతో ఇప్పుడు ఆయా పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడి తీవ్ర నష్టానికి గురవుతున్నామని యజమానులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్‌ దుకాణాల్లో చికెన్‌ అమ్మకాలు దాదాపు సగం పడిపోయాయి. ఇదే పరిస్థితి ఇంకా ఇంకా కొనసాగితే మాత్రం మరిన్ని కష్టాలు, తీవ్ర నష్టాలు తప్పవని పౌల్ట్రీ పరిశ్రమకు చెందినవారు ఆందోళన చెందుతున్నారు.

 

 

కాగా., కరోనా వైరస్ ప్రభావం వల్ల వ్యక్తిగతంగా నేను కూడా తీవ్ర నష్టానికి గురయ్యానని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అయితే.. రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు కేవలం  ఒక్క పౌల్ట్రీ పరిశ్రమకే రూ.1000 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని చెప్పారు. తాను కూడా ఒక పౌల్ట్రీ రైతునని, తనకు కూడా రూ.7 నుంచి 8 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు అంచనా వేశారు. అలా అని దుకాణాలు మూసుకుని కూర్చున్నా కూడా ఆ యొక్క కోళ్లకు దాణా వేయవలసి ఉంటుందని అన్నారు. 

 

 

 

ఇదిలఉండగా.. హైదరాబాద్‌ లోని ఐటీ ఉద్యోగికి ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లలో ముందస్తు బుకింగ్ చేసుకున్న రూంలన్నీ రద్దయిపోయాయి. ఆ కంపెనీల యొక్క  మీటింగ్‌లు, ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకోవటంతో ఇప్పుడు హోటల్‌ పరిశ్రమపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఎగుమతి, దిగుమతులు కూడా కాకపోవటంతో దీని ద్వారా కూడా నష్టం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: