చదువుకోవడానికి ఆడవాళ్ళకి స్వేచ్ఛలేని ఆ కాలం నుండి కూడా స్త్రీలు అంచల అంచలుగా ఎదుగుతున్నారు. నాటి చీకట్ల నుండి వెలుగులో ఆనందంగా ఉంటున్నారు. ఆ రోజుల నుండి ఈరోజు వరకు స్త్రీల అభివృద్ధి కనపడుతూనే ఉంది. అయితే స్త్రీలు ఆ కూరుకున్న కష్టాల నుండి బయట పడుతూ అనేక రంగాల్లో ఎన్నో రాణిస్తున్నారు.

 

IHG

 

డాక్టర్లుగా, యాక్టర్లుగా, పైలట్స్గా, పోలీసులుగా, వ్యాపారవేత్తలాగా, రచయితలుగా, సైంటిస్ట్స్గా, లాయర్లుగా ఇలా ప్రతి ఫీల్డ్స్లోఅభివృద్ధి చెందుతున్నారు. చదువులో ముందుంటూ అన్నింటిలో చక్కగా రాణిస్తున్నారు. అయితే ఎందరికో ఆదర్శం అయిన కిరణ్ బేడీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు చూసేయండి. ఆమె 1972 బ్యాచ్కి చెందిన పోలీసు శాఖలో అనేక పదవులని కైవసం చేసుకున్నారు.

 

మెగసెసె అవార్డులతో సహా అనేక అవార్డుని ఆమె అందుకున్నది. 1949వ సంవత్సరంలో పంజాబ్లో జన్మించింది. సూర్యదత్త నేషనల్ అవార్డు, రామన్ మెగసెసే అవార్డు, ప్రెసిడెంట్స్ గాల్లంట్రీ అవార్డు సొంతం చేసుకుంది కిరణ్ బేడీ. అమృత్సర్స్లో ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో లెక్చరరుగా పనిచేసింది. ఆ తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీసుకి ఎంపికయ్యింది.

 

 

ఢిల్లీలో ట్రాఫిస్ పోలీస్ కమిషనర్గా మాత్రమే కాక మిజోరాంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా జనరల్ అఫ్ పోలీసుగా, చండీగర్లో లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా ఐక్యరాజ సమితిలో కిరణ్ బేడీ పని చేసింది. ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించిన వారి కార్లని క్రేన్లతో పారద్రోలి కిరణ్ బేడీ ప్రసిద్ధి చెందింది. 

 

 

IHG

 

 

మహిళా శిరోమణి అవార్డుని 1995 సంవత్సరంలో కిరణ్ బేడీ సొంతం చేసుకుంది. అలానే లయన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. 1999 సంవత్సరంలో ప్రైడ్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. 2005 సంవత్సరంలో మదర్ థెరిస్సా జాతీయ స్మారక అవార్డు అందుకుంది. ఇలా కిరణ్ బేడీ ఎనలేని సేవ చేసింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది కిరణ్ బేడీ. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: