మూడు వారాల క్రితం ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భద్రతా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రజాప్రయోజనాలరిత్యా ఆయనపై వేటు వేసినట్లు పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
తాజాగా కేంద్ర హోం శాఖ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ గురించి స్పందించింది. బాబోరి బెస్ట్ ఫ్రెండ్ అయిన వెంకటేశ్వరావుకు ఊహించని షాక్ ఇచ్చింది. కేంద్రం ఆయన అవినీతిపై ఆధారాలు ఉన్నాయని... ఆయనను సస్పెండ్ చేయడం కరెక్టేనని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హోం శాఖ సమర్థించింది. ఏపీ ప్రభుత్వం వచ్చే నెల 7లోగా ఆయన అవినీతిపై ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
హోం శాఖ 25 కోట్ల 50 లక్షల రూపాయల పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని పేర్కొంది. ఈ అక్రమాల వెనుక ప్రధానంగా వెంకటేశ్వరరావు హస్తం ఉందని తెలిపింది. జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఏసీబీ డీజీతో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి గురించి విచారణ జరిపిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం వెంకట్వేశ్వరరావు పోలీస్ శాఖ ఆధునీకరణ పేరుతో అవినీతికి పాల్పడినట్లు గుర్తించింది. 
 
ఏపీ ప్రభుత్వం గత నెల 8న వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన తరువాత సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ (క్యాట్)ను వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు జీతం చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తోందని... రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తనపై వేటు వేశారని... సస్పెన్షన్ పై స్టే విధించాలని క్యాట్ ను కోరారు. క్యాట్ ఈ పిటిషన్ ను విచారించి తీర్పు రిజర్వ్ లో ఉంచింది.        

మరింత సమాచారం తెలుసుకోండి: