ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ భారత దేశంలో కూడా వ్యాప్తి చెందుతుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి.  అయితే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 31 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.  ఇక కొంత మంది వ్యక్తులు పనికట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వదంతులు సృష్టిస్తూ ప్రజలను భయాందోళలకు గురి చేస్తున్నారు.  తాజాగా  నగరంలో కరోనా లేదని..ఎవరూ కంగారు పడొద్దని సైబరాబాద్ సీపీ, ‘కరోనా’ నోడల్ అధికారి సజ్జనార్ తెలిపారు. జ్వరం, దగ్గు ఇలాంటివి వస్తే డాక్టర్లను సంప్రదించి సరైన వైద్య చికిత్స చేయించుకోవాలని అన్నారు. 

 

సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించి ముఖ్యమైన పనులు ఉంటే చూసుకోవాలని సూచించారు. అధికారికంగా వెలువడిన వార్తలనే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఫార్వర్డ్ చేయొద్దని పేర్కొన్నారు.  కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.  రహేజా మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను ఆయన తోసిపుచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. పుణె నుంచి వచ్చిన నివేదికలో ఫలితం నెగిటివ్‌గా వచ్చిందని నిర్ధారించారు. నగరంలో అసలు కరోనా లేదని అందరూ ప్రశాంతంగా ఉండాలని స్పష్టం చేశారు.  రహేజా మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను ఆయన తోసిపుచ్చారు.

 

కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని.. ఇకవేళ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయితే గాంధీ హాస్పిటల్ లో వైద్యులు సరైన చికిత్స అందిస్తున్నారని అన్నారు.  అంతే కాదు వదంతులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించడానికి, నిజాలు నిర్ధారించుకోవడానికి పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో   వస్తున్న పుకార్లను  నమ్మొద్దని ఐటీ సంస్థలకు సూచించారు. ఒకవేళ తప్పుడు సమాచారం పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: