ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన దూకుడు పెంచారు.  ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు.  తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచి ‘ప్రజా సంకల్పయాత్ర’ తో ప్రజల మద్యకు వెళ్లిన ఆయన వారి కష్టాలు... కన్నీళ్లు దగ్గరుండి చూశారు.  అప్పటి అధికార పార్టీ చేస్తున్న మోసాలు వారికి తెలియజేశారు. ప్రజలు ఇబ్బందులు ప్రత్యేక్షంగా చూసిన ఆయన నేను విన్నాను.. నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు.   అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు ఆంధ్రప్రజ. ఇక సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడ అవినీతి జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రభుత్వం అధికారులకు చెప్పిన విషయం తెలిసిందే.  

 

ఎన్నికల సమయంలో చోటా, బాబా నేతలు ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎన్ని జిమ్మిక్కులకు పాల్పపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది.  ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సామాన్యుడు ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది.

 

ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీపై సాధారణ పౌరులు 'నిఘా' యాప్ ను ఉపయోగించుకుని అధికార వర్గాలకు ఫిర్యాదు చేయొచ్చు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్‌ను ఆవిష్కరించారు.  ఇక  చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశం అయినా యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: