ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటవరకు మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 39 కి చేరింది. అయితే.. కొత్తగా ఈరోజు 5 గురికి కరోనా వైరస్ సోకింది. ఓవైపు కరోనాను జయిద్దాం అని మనం నినాదాలు చేసుకుంటుంటే.. మరోవైపు.. కరోనా మాత్రం విరుచుకు పడుతోంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో కొంచెం కొంచెం టెన్షనే స్టార్ట్ అవుతుంది.

 

 

అయితే.. 39 మందిలో.. 23 మంది భారతీయులు ఉండగా, 16 మంది విదేశియులు ఉన్నారు. ఈ వైరస్ రోజు రోజుకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రజలు చాలా త్వరగా ఈ మహమ్మారి భారిన పడుతున్నరు. అయితే.. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

 


కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి 6 అడుగుల దూరంలో ఉండాలి. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ముఖాన్ని స్కార్ఫ్ తో కప్పుకొని ఉండాలి లేదా మాస్క్ ధరించాలి. అలాగే దగ్గు, జలుబు ఉన్నవారికి కాస్త దూరంగా ఉండటం మంచిది. వైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను నేరుగా తాకకూడదు. ఒకవేళ ఆ వస్తువులను అనుకుని పరిస్తితులలో తాకితే వెంటనే చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ సానిటైజర్‌ తో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయటం వలన వైరస్ అనేది వ్యాప్తి చెందదు. ఈ నిబంధనలను పాటించడం వలన కరోనా నుంచి తప్పించుకోవచ్చు.

 

కాగా., చైనాలో ఆదివారం ఈ వైరస్‌‌ కారణంగా ఏకంగా 27 మంది చనిపోయారు. అయితే.. మన భారత దేశంలో కూడా కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు పాఠించవలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: