ప్రతి రోజు తిరుమల తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్ప వలసిన అవసరం లేదు. అందువలన టీటీడీ శ్రీవారి భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. విషయంలో ఎక్కువ మంది రద్దీగా వున్న ఏరియాలలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసినదే. ఈ చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్తగా, శ్రీవారి దర్శనంపై కొన్ని ఆంక్షలు విధించారు.

 

తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు.. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వున్నట్లైతే  వారుశ్రీవారి దర్శనానికి రావొద్దని అధికారులు వేడుకుంటున్నారు. ఒకవేళ తమ నిబంధనలు అతిక్రమించి, ఎవరైనా వస్తే మటుకు వారికి దర్శన భాగ్యం కల్పించకుండానే తిరిగి వెనక్కి నిర్దాక్షిణ్యంగా పంపించి వేస్తామని వారు చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. 

 

ఇంకా.. వారే కాకుండా ఆరోగ్య నిపుణులు.. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు వున్నవారు వీలైనంత వరకు పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేసెస్, సినిమా ధియేటర్స్.. ఇలా క్రౌడ్ వున్న ప్రాంతాలకు వెళ్లకుండా, తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సదరు పేషేంట్స్ ను కోరుతున్నారు. అలాగే వారినే కాకుండా మిగిలిన వారిని ఉద్దేశించి... క్రౌడ్ వున్న ప్రాంతాలకు ఎవరైనా వెళ్లాలనుకుంటే మాత్రం ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు తెచ్చుకొని చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సదరు నిపుణులు  సూచిస్తున్నారు. 

 

వైరస్ ప్రబలకుండా అధికారులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కరోనావైరస్ లక్షణాలు భక్తుల్లో ఎవరికైనా కనిపిస్తే మాత్రం వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. కరోనాను నివారించాలని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి మనకు విదితమే. జనాలు గుంపులుగా ఉండొద్దని అధికారులు పదే పదే  సూచిస్తున్నారు. అయితే తిరుమల ఎప్పుడూ భక్తులతో కిట కిటలాడుతుంది. ఇక వివిధ ప్రాంతాలు, దేశాల  నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అందుకే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: