మాజీ కేంద్ర మాజీ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయగారు గుండె పోటుకు గురి అవ్వడంతో.. హుటాహుటిన హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈరోజు అనగా సోమవారం ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అపోలోకి తరలించారు. అక్కడ సీనియర్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా మనకు పూర్తి సమాచారం రావలసి వుంది.

 

 

బండారు దత్తాత్రేయగారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనకు విదితమే కదా. అప్పుడప్పుడు ఆయన హైదరాబాద్ పర్యటనకు వస్తూ.. పోతూ వుంటారు. ఆయనంటే చాలామంది రాజకీయ నేతలకు ఎంతో అభిమాన గౌరవాలుంటాయి. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండారు దత్తాత్రేయ. పాలిటిక్స్‌ లో అతను మెగా కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ వివాదాలకు మాత్రం ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండటం గమనార్హం. 

 

 

అందు చేతనే గతంలో బీజేపీ ఆయనకు రెండు సార్లు కేంద్ర మంత్రి పదవిని అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా గతంలో అయన నియమితులు కావడం జనులకు తెలిసినదే. ఇక వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా బండారు దత్తత్రేయ పనిచేసి, ఎన్నో విశేష సేవలు మానవాళికి అందజేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసి, వివిధ వర్ణాల కార్మికులకు అయన యెనలేని సేవలు చేసారు.

 

 

తాజాగా పార్టీ పట్ల ఆయనకున్న వినయ, విధేయతను గుర్తించి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ గా బండారును బీజేపీ అధిష్టానం నియమించడం అది అయన విజయానికి తార్కాణంలా మనకు గోచరించక మానదు. బండారు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న పలువురు పార్టీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించాడనికి అపోలోకు కోకొల్లలుగా తరలి వెళ్తున్నారు. అయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: