ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మ‌ది నెల‌ల పాల‌న‌లో ఆ పార్టీ తిరుగులేని శ‌క్తిగా మారుతోంది. రోజు రోజుకు ఇత‌ర పార్టీల నుంచి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన టైంలో ఈ చేరిక‌లు జోరందు కోవడంతో అధికార పార్టీలో ఎక్క‌డా లేని జోష్ నెల‌కొంటే... ప్ర‌తిప‌క్ష టీడీపీ పూర్తిగా డీలా ప‌డుతోంద‌ది. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్న‌పురెడ్డి అదీప్ రాజ్ ఆధ్వ‌ర్యంలో వీరంతా వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గాజువాక ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి కూడా పాల్గొన్నారు.



ఇక జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లోని రాజంపేట‌లోనూ టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు వైసీపీలో చేరారు. ఇప్ప‌టికే రాజంపేట‌లో టీడీపీ కుదుల‌వ్వ‌గా ఈ వ‌రుస షాకుల‌తో అక్క‌డ ర‌మేష్‌రెడ్డి లాంటి వాళ్ల రాజ‌కీయ భ‌విత‌వ్యం సైతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక టీడీపీ నుంచే కాకుండా జ‌న‌సేన నుంచి కూడా అధికార వైసీపీలోకి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు న‌డుస్తున్నాయి. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆ పార్టీ వీరాభిమానుల‌కే న‌మ్మ‌కం లేక‌పోవ‌డం... ప‌వ‌న్ తిరిగి సినిమాలు చేసుకుంటుండడంతో జ‌న‌సేన శ్రేణులు కూడా వైసీపీలోకి వెళ్లిపోతున్నాయి.



ఇక కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరినీ జోగి ర‌మేష్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రోజు చూస్తుంటే ఎన్నిక‌ల టైంకు చాలా జిల్లాల నుంచి టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన కీల‌క నాయ‌కులు వైసీపీలో చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: