ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎన్నో దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనాలోని పుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ క్రమక్రమంగా ఒక్కో దేశానికి విస్తరిస్తూ వస్తోంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ ఈ వైరస్ వ‌ల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక చైనా తర్వాత ఇరాన్ దేశాన్ని కరోనా వైరస్ కబళిస్తోంది. చైనా తర్వాత ఎక్కువగా విలవిల్లాడుతున్న దేశం ఇరాన్‌ అని చెప్పాలి. ఇక ఇట‌లీ సైతం ఇప్పుడు క‌రోనా దెబ్బతో హ‌డ‌లి పోతుంది. ఇక క‌రోనా మన దేశానికి కూడా విస్తరించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత వారం రోజులుగా క‌రోనా వార్తలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో ఎక్కువ మంది అనుమానితులు ఉన్నా ఏ ఒక్కరికి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇక ఏపీలో తొలి పాజిటివ్ కేసు బయటపడింది. ఏపీలోని నెల్లూరు యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ కేసు ఏపీలోనే తొలి క‌రోనా పాజిటివ్ అయిన‌ట్ల‌వుతుంది. ఇక ఈ యుడ‌కుడు ఇటీవ‌లే ఇట‌లీ నుంచి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆ యువ‌కుడికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ కావ‌డంతో అత‌డు నివాసం ఉంటే నెల్లూరు న‌గ‌రంలోని చిన్న‌బ‌జారులో ఎలెర్ట్ ప్ర‌క‌టించారు. అక్క‌డ ఉన్న వారు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.

 

ఇక నెల్లూరులో ర‌థోత్స‌వం జ‌రుగుత‌న్న నేప‌థ్యంలో ఆ న‌గ‌రంలో ఓ యువ‌కుడికి క‌రోనా వైర‌స్ సాకింద‌న్న వార్త‌ల నేప‌త‌థ్యంలో అధికారులు కూడా అలెర్ట్ అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే ఏపీలో ఇప్ప‌టికే ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. రు. 100 కోట్లు కేటాయించి అయినా క‌రోనా వైర‌స్‌కు బ్రేకులు వేస్తామ‌ని చెపుతోంది. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అలెర్ట్ అయ్యింది. క‌రోనాకు పూర్తిగా బ్రేకులు వేసింది. ఇక కేర‌ళ‌లో క‌రోనా కేసులు, అనుమానితులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. కేర‌ళ ప్ర‌భుత్వం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: