అవును.. మీరు వింటున్నది నిజమే. అతి త్వరలో ఇండియాలో కార్లు ఎగరబోతున్నాయి.. కార్లు ఎగరడం ఏమిటి? అని ఆశ్చర్యంగా వుందా..! అదేనండి.. ఎగిరే కార్లు త్వరలో భారత్ లోనే తయారు చేయనున్నారు. అయితే ఇక్కడ మనం ప్రేత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే.. నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ అతి త్వరలో, గుజరాత్ లో గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లాంట్ ఏర్పాటు చేయనుంది. 

 

ఈ విషయమై, గుజరాత్ సీఎం శ్రీ విజయ్ రూపానీ సమక్షంలో.. ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ 'ఎమ్ కే దాస్', ఇంకా... PAL-V ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ 'కార్లో మాస్ బొమ్మెల్'.. తదితరులు MOU పైన సంతకాలు చేయడం జరిగింది. ఇక 2021నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలన్న దిశగా  గుజరాత్ లో PAL-V కంపెనీ ఫ్లాంట్ ను ఏర్పాటు చేయబోతోందని తాజా సమాచారం. 

 

IHG

 

PAL-Vకి సహాయం చేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమని, ఫ్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పుష్కలంగా లభిస్తాయని, భారత్ లో ఇలాంటి ఫ్లాంట్ ఇదే మొదటిది అని గుజరాత్ సర్కార్ పేర్కొనడం విశేషం. PAL-V ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ 'కార్లో మాస్ బొమ్మెల్', గుజరాత్ నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు.. "ఇక్కడ మంచి పోర్ట్, లాజిస్టిక్ సౌకర్యాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీ గుజరాత్ రాష్ట్రాన్ని ఫ్లాంట్ పెట్టేందుకు సెలక్ట్ చేసుకున్నట్లు ఈ సందర్భంగా కార్లో పేర్కొనడం విశేషం."

 

ఎగిరే కార్లు ఎగుమతి చేయాలని ఇప్పటివరకు PAL-Vకి 110 ఆర్డర్లు వచ్చాయని మాస్ బొమ్మెల్ గుజరాత్ సీఎంకు తెలపడం గమనార్హం. ఈ కారుకి రెండు ఇంజిన్స్ అమర్చబోతున్నారు. రోడ్డుపై ఈ కార్లు 160కిలోమీటర్ల వేగంతో.. గాల్లో 180 కిలీమీటర్ల మేరకు వేగంతో ఇవి ఎగురగలవు. కేవలం మూడు నిమిషాల్లోనే మాములు కారు, ఎగిరే కారుగా మారిపోగలదు మరియు ఫుల్ ట్యాంక్ తో 500 కిలీమీటర్ల మేర దూరాన్ని ఇది కవర్ చేయగలదు... ఇవియే ఎగిరే కారు ప్రత్యేకతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: