ప్రపంచ దేశాలని కలవరపెడుతున్న కరోనా వైరస్ వలన ప్రతి ఒక్కరూ భారతీయుల ఆచారాలను, సాంప్రదాయాలను కష్టపడుతూ మరీ కరెక్ట్ గా నేర్చుకోవడం ఆరంభించారు. షేక్ హ్యాండ్ వద్దు నమస్తే నే ముద్దు అనే స్లోగన్ ప్రస్తుతం ప్రతి ఒక్క దేశాధినేతల నోటి నుండి వస్తుందంటే మన భారతీయ నమస్తే సాంప్రదాయం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కరోనా వైరస్ ఇండియా నమస్తే కల్చర్ ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకే పుట్టికొచ్చిందని నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వీడియో నెట్టింట ప్రదర్శనమై మన ఇండియన్ సాంప్రదాయాన్ని విదేశీయులు ఎలా పాటిస్తున్నారో చెబుతోంది. 

 

 


వీడియోలో కనిపించిన వివరాలు తెలుసుకుంటే... తాజాగా లండన్ పల్లాడియంలో ప్రిన్స్ ట్రస్టు వార్షికోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు ప్రిన్స్ చార్లెస్ కూడా పాల్గొంటారు. అయితే ప్రిన్స్ కార్యక్రమానికి వచ్చేసిన క్షణమే అతన్ని ఒక వ్యక్తి స్వాగతిస్తుండగా... మొదటిగా ప్రిన్స్ ఆ వ్యక్తికి కరచాలనం చేయాలనుకుంటాడు కానీ వెంటనే తన హ్యాండ్ ని వెనక్కి లాక్కొని మరీ మన భారతీయుల సాంప్రదాయమైన నమస్కారం చేస్తాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ నమస్తే కల్చర్ ని సంతోషంగా పాటిస్తారు. తర్వాత కూడా ఈ కార్యక్రమంలో ప్రిన్స్ ఛార్లెస్ భారతీయుల నమస్తే సాంప్రదాయాన్ని ఒక విధేయుడిగా పాటిస్తాడు.

 

 

ప్రిన్స్ చార్లెస్ నమస్తే సాంప్రదాయాన్ని పాటిస్తున్న దృశ్యాలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకి నమస్కార సాంప్రదాయాన్ని పాటించమని మనదేశం చెబితే ఇతర దేశాలు మన సంస్కృతిని వెక్కిరిస్తూ అందలం ఎక్కించారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకి నమస్కారమే సంస్కారము అంటూ ప్రపంచ దేశాలు ఘనంగా మన సంస్కృతిని స్వాగతిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు మన ఇండియన్ సెలబ్రిటీలు కూడా షేక్ హ్యాండ్ లు వద్దు నమస్కారమే ముద్దు అని తమ అభిమానులకు సూచనలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: