ప్రపంచంలో ఎన్నికలు అంటే ఒక్క నెల రోజు ముందు చెవులు చిల్లలు పడేలా సౌండ్.. స్టేజీలపై నాయకుల ఉపన్యాసాలు.. మందు, డబ్బు, వస్తువుల పంపిణీలు అబ్బో ఒక్టి కాదు ఎంతో హంగామా ఉంటుంది. ఎన్నికలు వస్తున్నాయంటే నాయకుల్లో గుబులు.. ఓటర్లలో ఉత్సాహం ఉంటుంది.  ఇక భారత దేశంలో ఎన్నికలు అంటే మందు, డబ్బు ఇదే తంత్రం.. మంత్రం అంటారు నాయకులు.  ఓటర్లు కూడా దీనికే అలవాటు పడ్డారు.. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టి.. నోటుకు ఓటు అమ్ముకోవొద్దు అని చెప్పినా.. అబ్బే చెప్పడానికి బాగానే ఉంటుంది.. మా పక్కింటి వారికి పంచిపెట్టారట.. మాకు ఎందుకు ఇవ్వరు అన్న ప్రశ్నలే తలెత్తుతున్నాయి.  అయితే ఎన్నికలు వస్తు ఆ రెండు ఊళ్లలో ఎలాంటి టెన్షన్ ఉండదట.. హ్యాపీగా ఎన్నికలు పూర్తి చేసుకుంటారు.

 

అంతే కాదు ఆ ఊళ్లో ఎన్ని పార్టీలు ఉన్నా.. గ్రామస్తులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలోని చింతలవలస, ఇద్దనవలస అనే ఈ రెండు పంచాయతీల పాలకవర్గాలు 50 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఇదే తరహ సాంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాయి. చింతలవలస, ఇద్దనవలస పంచాయతీలు సుమారుగా యాభై సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. గ్రామస్తులందరూ ఒకదగ్గర సమావేశమై సర్పంచ్‌ వార్డు మెంబర్ల అభ్యర్థులను ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తారు.  

 

ఈ సాంప్రదాయం ఇప్పటివరకు ఒక్కసారి కూడా మిస్ కాలేదు. అలా ఇప్పటివరకు సర్పంచ్‌, వార్డుమెంబర్‌ స్థానాలకు గాను ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు.. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు గాను ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో తమ గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపిస్తారు. అందుకే ఈ రెండు గ్రామాలు మంచి అభివృద్ది పథంలో నడుస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి గ్రామాలను అందరూ ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుందో అని నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: