భూమ్మీద దొరికే ప్రతి జీవిని తిన్నొద్దురా, స్వామి!! అని ప్రపంచ దేశాలు చైనా కి చిలక్కి చెప్పినట్టు చెబితే... ఆ మాటల్ని పట్టించుకోకుండా అడ్డమైన గడ్డి తిని చివరికి ప్రపంచంలోని ప్రజలందరి ప్రాణాలకు ముప్పు తెచ్చారు చైనీయులు. భారతదేశంలోని నగరాలలో ప్రజలు తిరిగేందుకు ధైర్యం కూడా చేయడం లేదంటే కరోనా వైరస్ ప్రభావం మనపై ఎంతగా ఉందో చెప్పుకోవచ్చు.




గతంలో కర్ణాటక రాష్ట్రం కలబుర్గి కి చెందిన 76 ఏళ్ల వ్యక్తి కోవిడ్ 19 వ్యాధితో బాధపడుతూ హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఈ వృద్ధుడుని కేర్ ఆస్పత్రిలో చేర్చుకునే ముందు... హైదరాబాద్ సిటీ లోని ఇతర మూడు ఆస్పత్రులు అతడ్ని అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయి. ఎట్టకేలకు కేర్ ఆసుపత్రి అతన్ని చేర్చుకొని మూడు గంటల పాటు చికిత్సని అందించి గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. కానీ ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు అతడిని నేరుగా కలబుర్గి కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తాను ప్రాణాలను కోల్పోయాడు. అయితే కరోనా వైరస్ సోకిన ఈ వృద్ధుడు మొత్తం 4 ఆసుపత్రి లకు తిరగడం వలన ఆయా ఆసుపత్రిల సిబ్బంది లకు, అంబులెన్స్ డ్రైవర్ లకు కరోనా వైరస్ తాకినట్టు తెలిసింది.




కేర్ ఆసుపత్రిలోని 17 మంది వ్యాధిగ్రస్తుడితో కాంటాక్ట్ లో ఉండటంతో పాటు మరో మూడు ఆస్పత్రిలోని 100 మంది సిబ్బంది కూడా కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిసింది. ఐతే వాళ్లందరిలో 34 మందిని గుర్తించి కరోనా వైరస్ టెస్ట్ చేసేందుకు ఐసొలేషన్ వార్డు లో ఉంచారు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ... గుర్తించిన 34 మందిని ఇంటికే పరిమితం చేశామని, ఎప్పటికప్పుడు అబ్సర్వ్ చేస్తున్నామని, ఇప్పటివరకైతే వారి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఆస్పత్రులతో పాటు బాధితుడు పాతబస్తీలోని కట్టాలోని తన రిలేటివ్ ఇంటిలో ఆ రాత్రి గడిపినట్టు తెలిసింది. దాంతో అధికారులు ఆ కుటుంబ సభ్యులని గుర్తించి వారిని కూడా పర్యవేక్షిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: