ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సంచలనం సృష్టించింది. పోలింగ్ కూడా జరగకుండానే విజయ బావుటా ఎగరేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ కు ముందే పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధిక స్థానాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

 

ఏ జిల్లాలో వైసీపీ ఎన్ని స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకుందో ఓసారి చూద్దాం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ జోరు చాలా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 15 చోట్ల ఏకగ్రీవమయ్యారు. మొత్తం జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు గాను 225 చోట్ల ఏకగ్రీవమయ్యారు.

 

 

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 667 ఎంపీటీసీ స్థానాలకు గాను 48 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 1088 ఎంపీటీసీ స్థానాలను గాను 40 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

 

 

ప్రకాశం జిల్లాలో 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 11 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. నెల్లూరు జిల్లాలో 46 జెడ్పీటీసీ గాను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవమయ్యారు. గుంటూరు జిల్లా జిల్లాలో 54 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు 8 చోట్ల ఏకగ్రీవమయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: