చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ చైనాలో తగ్గుముఖం పట్టింది. అయితే.. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి అక్కడ తన ప్రతాపాన్ని చూపించి బాధిత సంఖ్యలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉండగా గల్ఫ్‌ దేశం అయిన బహ్రెయిన్‌ లో సోమవారం తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. మరణం సంభవించిన 65 ఏళ్ళ మహిళ ఇరాన్‌ నుంచి వచ్చింది. కాగా., ఇరాన్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ మహిళకు కరోనా సోకిందని ఆ వైరస్ కారణంగానే  మృతి చెందిందని బహ్రెయిన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది.

 

 

అయితే ఆమె ఇరాన్ నుంచి వచ్చిన తర్వాత ఆమె డైరెక్ట్ గా ఎవరిని కలవలేదని.. ఆమె బహ్రెయిన్‌ కు వేసిన తర్వాత ఐసోలేషన్‌ వార్డులోనే ఉంది. కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఆ దేశంలో 214 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వ శాఖ వెల్లడించింది. అయితే.. ఇప్పటి వరకు నమోదయిన కరోనా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. కావున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది.

 

 

ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో తొలి కరోనా మృతి చోటుచేసుకుంది. మొదటగా కరోనా మృతి చోటుచేసుకున్న గల్ఫ్ దేశంగా బహ్రెయిన్‌ నిలిచింది. అయితే.. బహ్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి తాఫిక్‌ అల్‌ రాబియా సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ను పెట్టారు. దాంట్లో ఏముందంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవటం అందరి బాధ్యత అని, ఇందుకు గాను అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అని పెట్టారు. 

 

 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా వలన అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తునన్నాయి. దీనికి గాను అబుదాబి మార్కెట్ ను పెంచేందుకు 1బిలియన్‌ దీరాంలు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పార్కులు, జిమ్ సెంటర్స్, స్పా సెంటర్స్ మూసివేస్తున్నట్లు పేర్కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: