చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్. ఈ మహమ్మారిని అదుపుచేయడానికి ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా., ఇప్పటి వరకు ఇండియాలో 129 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ భయంకరమైన వైరస్ ను నివారించడానికి ఏ మందు కనుక్కోలేదు. దీన్ని పూర్తిగా నివారించడమనేది పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులలో దీన్ని అదుపు చేయడానికి కావాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలుసుకోవటం మేలని అంటున్నారు వైద్య నిపుణులు. కాగా., సోషల్ మీడియాలలో ప్రజలను ఆందోళన కలిగించే లాగా పోస్ట్ లు పెడుతున్నారు. అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో డాక్టర్లు, కేంద్రం, పలు  మీడియాలు చెబుతున్నా.. కానీ ప్రజలలో ఆ భయం మాత్రం అలాగే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరోనా టెన్షన్ అనేది ప్రజల్లో పెరుగుతోంది. ఇదొకరకమైన మానసిక ఆవేదన. అంటే.. కరోనా నాకు వస్తుందేమో, నేను ఏమయిపోతానో ఇప్పుడెలా అనే భయం వారిని పట్టి పీడిస్తుంది. ఈ టెన్సన్స్ అన్నిటిని వదిలేసి ఈ సులభమైన జాగ్రత్తలను, సూచనలను పాటిస్తే సరి. అయితే.. ఇప్పుడవేంటోతెలుసుకుందాం.. 


ఈ వైరస్ లక్షణాలు: ఈ వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికి చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, కిడ్నీ వంటి అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. అయితే.. చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా చెందుతుందనే చెప్పాలి. కాబట్టి ఎక్కువగా ఎండకు ఉండటానికి ప్రయత్నించండి. ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించి వ్యాప్తి చెందుతోంది. 


ఈ వైరస్ మనకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇది సోకకుండా ఉండాలంటే ఇతరులను తాకకూడదు. ముఖ్యంగా ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకరాదు. ఎల్లప్పుడూ ముక్కుకు అడ్డుగా ఏదన్న ధరించాలి. అంటే మాస్క్ లను ధరించాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అసలు ఉండకూడదు. ఎవరిని కలవకుండా ఉంటె మంచిది.

 

ఒకవేళ బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. లేదంటే..  కనీసం 60 శాతం ఆల్కహాల్‌ తో హ్యాండ్ శానిటైజర్ వాడండి. కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా చలి వాతావరణంలో ఉండకూడదు. పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉంటె మంచిది. ఒక వేళ మీకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటె.. ఇంట్లో ఉండి, సరైన విశ్రాంతి తీసుకుంటూ అంటువ్యాధిని నియంత్రించడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించండి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: