ఈ మద్య ప్రపంచంలో ఎక్కువగా ఏది ట్రెండ్ అయితే... మార్కెట్ లోకి అవే వస్తుంటాయి.  అది సాంగ్ కావొచ్చు.. సినిమా కావొచ్చు.. మరేదైనా కావొచ్చు క్షణాల్లో మార్కెట్ లో ప్రత్యేక్షం అవుతుంటాయి.  తాజాగా ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ గురించి చర్చలే నడుస్తున్నాయి.  కరోనా అంటే కిరీటం అని అర్థం.. అలాంటి పేర్లతో గతంలో పలు షాపులు వేలసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  తాజాగా ఓ అడుగు ముందుకు వేసి కొంత మంది కరోనా గురించి చిత్ర విచిత్రమై టిక్ టాక్, వీడియోలు చేస్తున్నారు.. కరోనా పై ఎన్నో కామెడీలు వస్తున్నాయి.

 

తాజాగా సోషల్ మీడియాలో కరోనా కేకులు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా కరోనా గురించి తెలియని వారు అరుదు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఈ ‘కరోనా’ మాటనే తన వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడో వ్యాపారి. జర్మనీలోని ఎర్‌ఫర్ట్‌లో రోత్‌ అనే వ్యాపారి బేకరీ నడుపుతున్నాడు. అతనికి ఓ వింత ఆలోచన వచ్చింది.. ఇంకేముంది దాన్ని అమలు పరిచాడు. కరోనా భయంతో ఓ వైపు వ్యాపార రంగాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 

దాంతో తన బేకరీ షాప్ లో ఏదైనా వెరైటీ పెట్టి అమ్మాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రోతక్ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ‘కరోనా యాంటీ బాడీ ప్రాలైన్స్‌’ పేరుతో వైరస్‌ ఆకారంలో ఉన్న కేకులను తయారు చేసి అమ్మకానికి ఉంచాడు. రకరకాల రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్న ఈకేకులను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయంటూ ప్రచారం చేస్తున్నాడు. మొన్నటి వరకు దేన్ని చూసి భయపడ్డారో..  దాన్నే తినడంటూ ప్రచారం చేస్తూ పడేస్తున్న రూత్‌ తన ప్రయత్నంలో సక్సెస్ బాగానే అయినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: