ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ హల్ చల్ చేస్తుంది.  ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బయట తిరిగే పరిస్థితి నెలకొంది.  ఇప్పటి వరకు ఏ వైరస్ వల్ల ఇంత దారుణమైన నరకాన్ని, టెన్షన్ అనుభవించలేదు.  చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది.  ఈ నేపథ్యంలో కరోనా (కోవిడ్‌–19) మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంటుందని విశాఖ శ్రీ  శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.

 

పాప గ్రహాల శక్తి పుంజుకోవడంతో పాటు రాహువు దృష్టి గ్రహాల మీద పడిందని, అందుకే దేశంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన అన్నారు.  స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. పీఠంలో నేటి నుంచి ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా లోక కల్యాణం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముందు జాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించింది.

 

అలాగే అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి.  ఈ నేపథ్యంలో  ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని చెప్పారు. అందుకే విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది పాల్గొంటున్నారని చెప్పారు.   సామాజిక స్పృహతో వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు. శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీదప్రభావం ఉందన్నారు.  లోక కళ్యాణం కోసం చేసే ఈ యాగాల వల్ల దైవం మనకు అనుకూలిస్తారని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: