ప్రస్తుతం ప్రపంచాన్ని కివీడ్-19(కరోనా) వణికిస్తోంది. చైనా, ఇటలీలో మరణాల సంఖ్య అధికమవుతోంది. ఈ రెండు మూడు రోజుల్లో పరిస్థితి మరింత దారుణం. ఈ వైరస్ నీ తమే కొని తెచ్చుకున్నాం అని ఇటలీ కి చెందిన ఓ వ్యక్తి రాసిన లేఖ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. పరిస్థితి చేయి దాటాక ముందే మీరు జాగ్రత్త పడండి అను లేఖ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ లేఖ వైరల్ గా మారింది.

 

లేఖ లో ఇటలీ దేశంలో మిలాన్ అందమైన నగరం. ఇక్కడి ప్రజల సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపే వారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా పరిస్థితులు మరాయి. మేం నివసించేది క్యారంటైన్ లో.. ఇక్కడ మాకు మేము నిర్భందం లో బ్రతుకు ఉన్నాం. విధులకు వెళ్లలేం.. వెళ్ళిన పోలీసులు జైల్ లో వేస్తారు. ఇక్కడున్న షాపులు, మాల్స్, ఆఫీస్ లు అన్ని మూతబడ్డాయి. మాకు అనిపిస్తుంది యుగాంతం వచ్చిందా అని.. ఇప్పటితో మా జీవితాలు ముగిశాయి. 

 

మేం చేసిన తప్పే ప్రస్తుతం మేం అనుభవిస్తున్న కష్టాల కు కారణం. పది రోజులు క్రితం మా ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటించి ఉంటే మాకి కష్టాలు వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

వైరస్ నియంత్రణకు సెలవులు ఇస్తే విహారయాత్రకు, సినిమాలు, పార్టీలు అంటూ తిరిగాం. గుంపులు గుంపులు గా ఉంటూ ముచ్చట్లు పెట్టాం.వైరస్ వ్యాపిస్తుందని బయటకు వెళ్ళొద్దని ప్రభుత్వం సెలవులు ఇస్తే తాము విహారయాత్రలకు వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, షికార్లు తిరిగాం, చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం అన్నారు. బజారులో కూర్చుని గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నాం. ప్రభుత్వం చెప్పిన సూచనలు పక్కన పెట్టాం. 

 

ఆక్షణం చేసిన చిన్న తప్పు తో ఇక్కడ రోజుకి 200 చనిపోతున్నారు. ఇక్కడ మందులు, డాక్టర్స్ లేక కాదు. సరైన స్థలం లేక. 80ఏళ్ల వృద్దుడి ని కరోనా వస్తే సజీవంగా తగలబెట్టారు. ఇదంతా దేశ ప్రజలుగా తాము చేసుకున్న తప్పే అని బాధ పడ్డారు. ప్రపంచ ప్రజలారా ఇటలీ కి వచ్చిన పరిస్థితి మీకు రావొద్దు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోండి అంటూ లేఖ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: