క‌రోనా మ‌హ‌మ్మారి తెలంగాణ‌లో విజృంభిస్తోంది. బుధ‌వారం సాయంత్రం ఒక్క రోజే ఏకంగా ఏడుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు రిపోర్టులు స్ప‌ష్టం చేయ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఎలెర్ట్ అయ్యారు. ఇక గురువారం ఉద‌యం నుంచే సీఎం కేసీఆర్ ఆఘ‌మేఘాల మీద పోలీసు శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖ‌తో పాటు అన్ని శాఖ‌ల‌ను అలెర్ట్ చేశారు. ఇక గురువారం కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అన్నీ నగరాల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు.



క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ఏం చేయాలా ? అని చ‌ర్చించారు. ప్ర‌తి న‌గ‌రంలోనూ ఎక్కువ మంది ర‌ద్దీ లేకుండా చూడాల‌ని నిర్ణ‌యించారు. జ‌నాలు గుమి కూడా ఉంటే వాళ్ల‌ను వెంట‌నే చెద‌ర గొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక విదేశాల నుంచి వ‌చ్చే వారి విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. వారు కొన్ని రోజుల పాటు బ‌య‌ట‌కు రాకుండా ప్ర‌త్యేక నిఘా పెట్టాల‌ని.. వారి పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల‌ని నోటీసులు ఇవ్వాల‌ని.. అలాగే వారికి ప్ర‌త్యేక కౌన్సెలింగ్ ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.



ఇక మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించారు. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌ధాని హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు తెలంగాణ‌లోని మిగిలిన జిల్లాల‌కు కూడా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే నిషేధాజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు.



ఇక కరీంన‌గ‌ర్ సిటీలో 13 మంది ఇండోనేష‌యిన్లు ఉన్న‌ట్టు గుర్తించారు. మొత్తం భార‌త్‌కు 150 మంది రాగా.. వీరిలో 13 మంది తెలంగాణ‌కు వ‌చ్చార‌ని... వీరంతా క‌రీంన‌గ‌ర్లో తిరుగుతుంటే క‌రీంన‌గ‌ర్ వాసులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: