ప్రస్తుతం ఎటు చూసిన ఎం విన్నా అందరి నోటా కరోనా మాటే. ఈ వ్యాధి ఎంత వేగంగా విజృభిస్తుందో మాటలో చెప్పాల్సిన మాటే లేదు. కరోనా భయం ప్రపంచ వ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. ఈ వ్యాధి ఇండియాలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే వేరే దేశాలలో ఈ వ్యాధితో చాలా మంది చనిపోయారు. మరికొంత మంది ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు.

 

ఇప్పటికే దేశంలో చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు బయట పడుతున్నాయి. ఒక్కవైపు ఈ వ్యాధికి భయపడి చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రోమ్ హోమ్ ఇచ్చారు. ఇప్పటికే ఐటీ రంగంలో దీన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. వ్యాపార - వర్తక సంస్థలు - ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు అలర్ట్ అయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన వారు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నాయి.

 

కరోనాపై ఇటు రాష్ట్రంలోను అటు దేశంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ఏ ఒక్కరిని వదలడం లేదు. ప్రతి ఇంటికి వెళ్లి విచారించి కరోనా లక్షణాలు ఉన్న బాధితులను వెంటనే గుర్తిస్తోంది. బాధితుల సంఖ్య పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోసారి కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

 

సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ లో సగం మందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించమని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మిగిలినవారు కార్యాలయాలకు హాజరుకావాలని తెలిపింది. కేంద్ర సిబ్బంది ఫిర్యాదుల మేరకు మంత్రిత్వ శాఖ గురువారం తెలియజేసింది. రూపొందించిన జాబితా ప్రకారం ఒక నిర్దిష్ట రోజు ఇంటి నుండి పని చేయబోయే కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలిఫోన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: