జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మూడు రాజధానులలో భాగంగా కర్నూలులో హైకోర్టు కార్యాలయాలు తరలింపు ప్రక్రియకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులకు ఇచ్చిన జీవో సస్పెండ్ చేసింది. కాగా, రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి, సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషయల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనుకున్నారు.

 

ఈ క్రమంలోనే హైకోర్టు కర్నూలుకు తరలించే క్రమంలోనే విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులని తరలింపుకు జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై రాజధాని ప్రాంత రైతులతో పాటు, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.

 

ఇక ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. అయితే ప్రభుత్వం స్థలం సమస్య కారణంగానే కర్నూలుకు మారుస్తున్నామని వివరణ ఇచ్చింది. కానీ కోర్టు మాత్రం స్థలం సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చుకోవచ్చంటూ సూచించింది. ఈ క్రమంలోనే కర్నూలులో ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్సీ కమిషనర్ తో పాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. సచివాలయంతో సంబంధం లేని ఈ కార్యాలయాలకు 11 వేల చదరపు అడుగుల స్థలం అవసరం ఉందని గుర్తించామని అందుకే తరలింపు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

 

అయితే ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన  హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తానికైతే జగన్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులకు మండలిలో అడ్డు తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఆరు వారాలు ఎన్నికలను నిలుపుదల చేసారు. ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: