కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో దగ్గు, తుమ్ములు వస్తే చాలు పెద్ద అనుమానం పెరిగిపోతుంది. ఈ కరోనా దెబ్బకు మామూలు తుమ్ములు, దగ్గు వస్తే చాలు హడలిపోతున్నారు. ఇంకా కరోనా వైరస్ వచ్చేసిందేమో అని హాస్పిటల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా టెస్ట్ చేయించుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. కొందరు బాగా డౌట్‌తో తప్పనిసరిగా టెస్ట్ చేయించుకుంటున్నారు. కాకపోతే ఈ కరోనా టెస్ట్ కాస్త ఖరీదుగానే ఉంది.

 

ప్రస్తుతం ఈ కరోనా నిర్ధారణ పరీక్ష రూ. 5 వేలు అవుతుంది. ప్రైమ‌రీ టెస్ట్‌కు రూ. 1500,  నిర్దార‌ణ టెస్ట్‌కు రూ.3500 అవుతున్నాయి. అయితే రూ. 5 వేలు టెస్ట్ కంటే చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ఫ్యామిలీలకు ఇంత డబ్బు పెట్టడం అనేది కాస్త ఇబ్బందే. కాకపోతే ఈ ఖరీదు మరో నెల రోజుల్లో తగ్గనుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు కరోనా వైరస్ తగ్గించే మెడిసిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

అలాగే కరోనా టెస్ట్ వ్యయం తగ్గించేలా అతి తక్కువ ధరలో టెస్టింగ్ కిట్‌ని రెడీ చేస్తున్నారు. కేవలం రూ. 500కే టెస్టింగ్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇక ఇదే విషయమై ప్రముఖ ల్యాబ్ నెట్‌వర్క్ సంస్థ ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు మాట్లాడుతూ.. ‘కరోనా నిర్ధారణ పరీక్షల కోసం మన దేశం.. లేటెస్ట్ టెక్నాలజీని జర్మనీ, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. అందుకే భారీ స్థాయిలో ఖర్చు అవుతోందని, అయితే ఈ టెక్నాలజీని మన దేశంలోనే అభివృద్ధి చేసుకుంటే పరీక్ష ఖర్చు రూ.500 లోపే ఉంటుందని వెల్లడించారు.

 

అతి త్వరలోనే లేటెస్ట్ టెక్నాలజీతో కరోనా టెస్టింగ్ పరికరాలని తయారు చేసే అవకాశముందని, నెల రోజుల్లో రూ. 500కే కరోనా టెస్టింగ్ కిట్ రెడీ అవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: