ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణ మృందంగం మోగిస్తోంది. ఇక కరోనా వైరస్ బారిన పడుతున్నవారిలో వృద్ధులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. 60 లేదా 65 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌తో పాటు 10 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌లు సైతం క‌రోనా భారీన ప‌డితే త్వ‌ర‌గా చ‌నిపోతున్నారు. ఇక పండుటాకులను రక్షించుకోవడం ఎలాగో అర్థం కాక ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. అస‌లు క‌రోనా పుట్టిన చైనా, అమెరికా లాంటి దేశాలు ఈ మ‌హ‌మ్మారిని ఏదోలా కంట్రోల్ చేస్తుంటే ఇట‌లీ మాత్రం క‌రోనా దెబ్బ‌తో విల‌విల్లాడిపోతోంది. అస‌లు ఇట‌లీలో క‌రోనాకు గురైన వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌ర‌గ‌డం లేదు

.

ఓ విధంగా చెప్పాలంటే ఈ విష‌యంలో ఇట‌లీ చేతులు ఎత్తేసింద‌నే అనాలి. ఇక్క‌డ మృతుల సంఖ్య రోజుకి వందల్లో పెరుగుతుంది. శనివారం ఒక్కరోజే ఏకంగా 793 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4825 దాటిందని లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా దాదాపు ఏడువేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారట. దీంతో దాదాపు యాభైవేలకు వైరస్‌ బాధితులు చేరారు. రోజు రోజుకి శవాలు గుట్టలుగా పడిపోతున్న నేపథ్యంలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాట్టరెల్లా కన్నీరు పెట్టుకున్నారు



అయితే ఇట‌లీలో వృద్ధుల‌ను ర‌క్షించుకునేందుకు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి నఫ్తాలీ బెన్నెట్ కీలక సూచనలు చేశారు. ప్రపంచమంతా దీన్ని అనుసరిస్తే.. వృద్ధులను కాపాడుకున్నవారమవుతామని ఆయన తెలిపారు. క‌రోనా ప్ర‌భావానికి గుర‌వుతోన్న వారిలో ... 70, 80 ఏళ్ల‌లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. ఇక యువ‌త అంతా అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు వారిని ప్రేమ‌తో హ‌గ్ చేసుకోవ‌డం గ‌ట్టా చేయ‌వ‌ద్దు.. షేక్ హ్యాండ్ ఇవ్వ‌ద్దు.. త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు పెట్టుకోండి.. వీలైనంత వరకు ఇంట్లోకి వెళ్లకుండా.. దాదాపు మూడు మీటర్ల దూరాన్ని పాటించాల‌న్నారు. అలా కొన్ని నెల‌ల పాటు చేస్తూ క‌రోనా ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: