కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు అన్ని విధాలుగా వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్త పడుతూనే రోగుల గురించి జాగ్రత్త పడుతూ కరోనా వైరస్ మీద పోరాటం చేస్తున్నారు. కరోనా వైరస్ అనేది వాళ్లకు ఇప్పుడు ఒక రకంగా నరకం చూపిస్తుంది అనే చెప్పవచ్చు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా సరే వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవడం ఖాయమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా ను కట్టడి చేయడం, నయం చేయడం అనేది సాధ్యం కాదని అంటున్నారు. 

 

అద్రుష్టం ఉన్న వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కరోనా వైరస్ తీవ్రత అనేది ఇప్పుడు అతి వేగంగా పెరుగుతుంది. అయితే ఇక్కడ వైద్యులు మాత్రం వైద్యం చేయడానికి ముందుకి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. వాళ్ళు ముందుకి వచ్చి తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు. ఇటలీ సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వైద్యుల్లో. వాళ్ళు అందరూ కూడా దాని కారణంగా ఇబ్బంది పడ్డారు. 

 

ఇక వైద్యుల కుటుంబ సభ్యులు కూడా తమ వారి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను కాపాడుకోవడానికి తమ వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనితో చాలా మంది వైద్యులు ఇప్పుడు విధుల నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు వారికి జీతాలను కూడా అవసరం అయితే పెంచే ప్రయత్నాల్లో ఉందని అంటున్నారు. కరోనా వైరస్ కట్టడి అనేది వైద్యుల సహకారం లేకుండా సాధ్యం అయ్యే పని కాదు కాబట్టే ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: